Actress Laila: హీరోయిన్‌ లైలా ఏంటి ఇలా మారిపోయింది?

10 Mar, 2023 08:49 IST|Sakshi

‘వైశాలి’ వంటి హిట్‌ చిత్రం తర్వాత హీరో ఆది పినిశెట్టి– దర్శకుడు అరివళగన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘శబ్దం’. 7ఎ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్‌పై 7ఎ శివ నిర్మిస్తున్నారు. లక్ష్మీ మీనన్‌ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నటి లైలా కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్‌ అనౌన్స్‌ చేసి, ఆమె లుక్‌ రిలీజ్‌ చేశారు. ‘

‘తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న చిత్రం ‘శబ్దం’. మునుపెన్నడూ చూడని కొత్త పాత్రలో లైలా కనిపిస్తారు’’ అని యూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సహనిర్మాత: భానుప్రియ శివ, సంగీతం: తమన్, కెమెరా: అరుణ్‌ పద్మనాభన్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: ఆర్‌. బాలకుమార్, రచన– దర్శకత్వం–లైన్‌ ప్రొడ్యూసర్‌: అరివళగన్‌. 

మరిన్ని వార్తలు