పనివేళలు అయిపోయాక ఎవరినీ కలవొద్దు

9 Aug, 2020 08:27 IST|Sakshi

మాన్వి గగ్రూని గుర్తుపట్టని ఇల్లు లేదు. ఇది అతిశయోక్తి కాదు నిఖార్సైన నిజం. తెర మీద కనిపించడానికి అభినయమే అవసరం..గ్లామర్‌ ఆప్షన్‌ మాత్రమే అని నిరూపించి నటననే గ్లామర్‌గా మార్చుకుంది. 

  • పుట్టింది, పెరిగింది, చదువుకున్నది  ఢిల్లీలో. తల్లి ఊర్మిళ గగ్రూ, తండ్రి సురేందర్‌ గగ్రూ, అక్క మాన్సి గగ్రూ.. ఆమె కుటుంబం. సైకాలజీలో డిగ్రీ చేసింది. 
  • కథక్‌ నృత్యం, జాజ్‌ సంగీతం నేర్చుకుంది. భోజనప్రియురాలు. దక్షిణ భారత వంటలంటే పీట వేసేసుకుంటుంది. హిందీ, ఇంగ్లిష్, కశ్మీరీ, బెంగాలీ భాషల్లో ప్రవీణ.
  • తొలిపరిచయం.. 2007లో ‘ధూమ్‌ మచావో ధూమ్‌’ టీవీ సీరియల్‌తో. గుర్తింపు తెచ్చుకుంది.. ‘టీవీఎఫ్‌ పిచ్చర్స్‌’, ‘టీవీఎఫ్‌ ట్రిప్లింగ్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌తో. ‘ఫోర్‌ మోర్‌ షాట్స్‌ ప్లీజ్‌’తో పాపులర్‌ అయింది.. .  
  • సిల్వర్‌ స్క్రీన్‌ ఐడెండిటీ.. ‘ఆమ్‌రస్‌’, ‘నో వన్‌ కిల్డ్‌ జస్సికా’, ‘ఎ క్వశ్చన్స్‌ మార్క్‌’, ‘పీకే’, ‘ఉజ్డా చమన్‌’, ‘శుభ్‌ మంగళ్‌ జ్యాదా సావధాన్‌’. గుర్తుండిపోయే టెలీఫిల్మ్స్‌.. ‘తూ హై మేరా సండే’, ‘గై ఇన్‌ స్కై’, ‘377 అబ్నార్మల్‌’. 
  • యువత మనసుదోచుకున్న  మాన్వి యూట్యూబ్‌ చానెల్‌ పెర్ఫార్మెన్సెస్‌..‘ఎవ్రీ బాంబే గర్ల్‌ ఇన్‌ వరల్డ్‌’,  ‘గర్లియాపా’, ‘బద్షాస్‌ మెర్సీ సాంగ్‌’.
  • నటన ఆమె  కెరీర్‌ ఆప్షన్‌ కాదు. చదువుకు సంబంధించిన వృత్తిలోనే స్థిరపడాలనుకుంది. కాని ఆమె సోదరి మాన్సి ప్రోద్బలంతో మేకప్‌ వేసుకుంది. 
  • అభినయ కళలో మెలకువల కోసం.. ‘సిల్లీ పాయింట్‌ ప్రొడక్షన్స్‌’ థియేటర్‌ గ్రూప్‌లో చేరింది. దనేష్‌ ఖంబట్టా, మెహెర్జాద్‌ పటేల్‌ వంటి రంగస్థల దిగ్గజాలతో కలిసి పనిచేసింది. 
  • మాన్వి పర్సనాలిటీ.. నిర్మొహమాటం, కేర్‌ ఫ్రీ, నో కాంప్రమైజ్‌.
  • ఇష్టపడేవి..  పుస్తకాలు, భిన్న రుచుల ఆహారం, నాట్యం.  ‘‘బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా యాక్టింగ్‌ ఫీల్డ్‌లోకి ఎంటర్‌  అయ్యే వాళ్లకు నేను చెప్పేది ఒకటే. అవకాశాల కోసం ఇళ్లకు వెళ్లకండి. కేఫ్, రెస్టారెంట్‌ వంటి చోట్లలోనే కలవండి. ఆఫీస్‌ పనివేళలు అయిపోయాక ఎవరినీ కలవొద్దు. మరో ముఖ్యమైన విషయం మీ ప్రతిభ, ధైర్యాన్నే నమ్ముకోండి’’ 
మరిన్ని వార్తలు