మా తాతయ్య కాళ్లు పట్టుకుని ఏడ్చాను: మధు కృష్ణన్‌ ఎమోషనల్‌

8 May, 2021 15:59 IST|Sakshi

నటి మధు కృష్ణన్‌.. అటు సినిమాల్లో సహనటిగా, ఇటూ పలు సీరియల్లో నటిస్తూ ఫుల్‌ బిజీగా అయిపోయింది. దాదాపు 1300లకు పైగా స్టేజ్‌ షోలకు యాంకర్‌గా వ్యవహరించిన ఆమె ప్రస్తుతం దేవత, జానకి కలగనలేదు, హిట్లర్‌ గారి పెళ్లాం వంటి సీరియల్‌లో నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక షోకు అతిథిగా వచ్చిన ఆమె చిన్నతంలో ఎదుర్కొన్న చేదు సంఘటనలను గుర్తుచేసుకుంది. పదేళ్లకే తల్లిదండ్రులకు దూరమై అనాథలా పెరిగినంటూ కన్నీటి పర్యంతం అయ్యింది.

మధు మాట్లాడుతూ.. ‘నా పదేళ్ల వయసులో మా నాన్న రోడ్డు యాక్సిండెంట్‌లో చనిపోయారు. అమ్మకు అప్పటికి 25 ఏళ్ల వయసు. చిన్న వయసులోనే నాన్న చనిపోవడంతో అమ్మమ్మ, తాతయ్య అమ్మను తీసుకుని వెళ్లిపోయారు. నేను ఆడపిల్లనని, నన్ను పోషించే స్థోమత వారికి లేదని చెప్పి నన్ను ఒంటరిగా వదిలేసి మా అమ్మను మాత్రమే తీసుకెళ్లారు. దీంతో చిన్నప్పడే అమ్మనాన్నకు దూరమయ్యాను. అయితే బంధువులంతా నన్ను ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్పించి వదిలించుకొమ్మని చెప్పినా కూడా నానమ్మ, తాతయ్య నా బాధ్యతను తీసుకునేందుకు ముందుకు వచ్చారు.

అప్పుడు నేను వెళ్లి మా తాతయ్య కాళ్లు పట్టుకుని ఏడ్చాను. మీరు ఎలా చెప్తే అలా చేస్తాను.. మీకు ఉన్నదే నాకు పెట్టండి చాలు అని వేడుకున్నాను’ అంటూ భావోద్యేగానికి లోనయ్యింది. అయితే అప్పటికే నానమ్మ తాతయ్యకు వయసు మీద పడిందని,  కనీసం నడవలేని స్థితిలో కూడా వారు లేరని పేర్కొంది. ‘వారిద్దరూ చాలా పెద్దవారు. అయినా కష్టపడి నన్ను పెంచారు. వాళ్లు తినకపోయిన నాకు పెట్టెవారు. అయితే నేను ఎప్పుడు చదువులో ఫస్ట్‌ క్లాస్‌ వచ్చేదాన్ని. 10వ తరగతి తర్వాత నన్ను చదివించే స్థోమత లేకపోవడంతో మా పక్కింటి బామ్మ వాళ్లు నన్ను డిప్లమా వరకూ చదివించారు. అంతేకాదు నాకు పెళ్లి కూడా చేయాలనుకున్నారు. ఇంతలో తాతయ్య చనిపోవడంతో మాకు ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి.

దీంతో చదవుతూనే స్టేజ్‌ షో చేయడం మొదలుపెట్టాను’ అని పేర్కొంది. స్టేజ్ షోలు చేసే సమయంలో భయం, బాధ వెంటాడేవని, చదువు ఆగిపోతుందని బాధతోనే స్టేజ్‌ షోలు చేసేదాన్నన్నారు. ‘లోపల బాధపడుతూనే పైకి నవ్వుతూ ఉండేదాన్ని. అలా మెల్లమెల్లగా యాంకరింగ్ మొదలుపెటి తొమ్మిదేళ్లలో దాదాపు 1300 స్టేజ్‌ షోలు చేశా. ఇక మళ్లీ వెనక్కితిరిగి చూసుకోలేదు. కాలేజ్‌కి వెళ్తూనే స్టేజ్‌ షోలు చేశా.. ఈవెంట్స్ చేస్తూనే బీటెక్ పూర్తి చేశా.. ఎంటెక్ కూడా స్టార్ట్ చేశా కానీ ఇక చాల్లే అనుకుని ఎంటెక్‌ మధ్యలోనే మనేశా. కష్టాలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కొన్నాను.. ఒంటరి అని బాధపడలేదు. పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కొన్ని ఇప్పుడు ఈ స్థాయిలో ఉండగలిగాను’ అంటూ చెప్పుకొచ్చింది మధు.
చదవండి: 
 ఘనంగా సీరియల్‌ నటి కీర్తి సీమంతం..ఫోటోలు వైరల్‌

మరిన్ని వార్తలు