శ్రీదేవితో ప్రత్యేక అనుబంధం.. మహేశ్వరి ఫ్యామిలీని చూశారా?

8 Mar, 2023 21:28 IST|Sakshi

అప్పటి తెలుగు సినీ అభిమానులకు సుపరిచితమైన పేరు మహేశ్వరి. అప్పట్లో పలు అగ్రహీరోలతో సినిమాలు చేసింది. ఇప్పటి సినీ ప్రేక్షకులకు ఆమె పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సుమారు 35 చిత్రాల్లో తన అందం, అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకుంది. తెలుగులో పెళ్లి చిత్రంలో హీరోయిన్‌గా ఆకట్టుకుంది.  

అయితే మహేశ్వరి తెలుగులో అమ్మాయి కాపురం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. పెళ్లి సినిమాతోనే మహేశ్వరికి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత రవి తేజతో కలిసి జంటగా నటించిన నీకోసం చిత్రానికి ఉత్తమ నటిగా నంది పురస్కారాన్ని అందుకుంది. గులాబీ సినిమా ఆమెకు మరింత క్రేజ్‌ తెచ్చి పెట్టింది. అయితే 2008లో జయకృష్ణ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అయితే శ్రీదేవికి బంధువైన మహేశ్వరి ఇప్పుడేలా ఉంది? ఏం చేస్తోందో తెలుసుకుందాం.

తమిళంలో ఎంట్రీ

ఉల్లాసం అనే తమిళ చిత్రంతో సినీ రంగంలో ప్రవేశించింది. ఆమె తమిళంలో అజిత్, విక్రం వంటి అగ్ర నటుల సరసన నటించింది. ' జీ తెలుగు సీరియల్ 'మై నేమ్ ఈజ్ మంగతాయారు'లో నటించింది. అయితే ఈ ధారావాహిక తమిళంలో కూడా ప్రసారమయ్యేది. తెలుగులో గులాబీ, దెయ్యం, నీ కోసం, పెళ్లి, ప్రియరాగాలు, మా అన్నయ్య, తిరుమల తిరుపతి వెంకటేశ, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తెలుగులో చివరిసారిగా తిరుమల తిరుపతి వెంకటేశ చిత్రంలో కనిపించింది. 

శ్రీదేవి ఫ్యామిలీతో ప్రత్యేక అనుబంధం

ఈ మధ్య కాలంలో ఆమె కనుమరుగయ్యారు. అయితే తాజాగా ఇటీవల సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన ఆమె ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్‌కు అండగా ఉంటున్నారామె. చెన్నైకి వచ్చినప్పుడల్లా శ్రీదేవితోనే కలిసి ఉండేవారట. ప్రస్తుతం షూటింగ్స్‌లో జాన్వీకి తోడుగా ఉంటున్నారు. తాజా సమాచారం ప్రకారం నటి మహేశ్వరికి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. 
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు