Mallika Sherawat: నటి మల్లికా శెరావత్‌ ప్రధాన పాత్రలో పాంబాట్టం

29 Nov, 2022 15:11 IST|Sakshi

బాలీవుడ్‌ భామ మల్లిక శెరావత్‌ ప్రధాన పాత్రలో నటింన చిత్రం పాంబాట్టం. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో పాన్‌ ఇండియా చిత్రంగా రపొందుతున్న ఈ చిత్రాన్ని వైద్యనాథన్‌ ఫిలిం గార్డెన్‌ పతాకంపై వంశీ పళనివేల్‌ నిర్మిస్తున్నారు. ఈయన ఇంతకు ముందు ఓర్పుతో, వాద్ధియార్, 6.2 వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించారు. కాగా వీసీ వడివుడయాన్‌ కథా, కథనం, మాటలు, పాటలు, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించిన ఈ చిత్రంలో నటుడు జీవన్‌ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం.

నటి రితికాసేన్, యాషీక ఆనంద్, సాయి ప్రియ, సుమన్, క్రికెట్‌ క్రీడాకారుడు సలీల్‌ అంగోలా, శరవణన్, రమేష్‌ ఖన్నా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇనియన్‌ జే.హరీష్‌ చాయగ్రహణంను, అమ్రీష్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చెన్నైలోని ప్రసాద్‌ ల్యాబ్‌ నిర్వహించారు. చిత్ర ఆడియోను నటుడు ఆర్య ఆవిష్కరించారు. నటుడు, నిర్మాత కే.రాజన్, దర్శక, నటుడు ఏ.వెంకటేశ్‌ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

చిత్ర దర్శకుడు వడివుడయాన్‌ మాట్లాడుతూ ఇది క్రీస్తు పూర్వం 1000, 1500, 1980 కాలం ఘట్టాల్లో జరిగే కథ చిత్రంగా ఉంటుందన్నారు. 126 అడుగుల పొడవైన పాము చేసే అట్టహాసం ఇంతవరకు ఏ చిత్రంలోనూ చూసి ఉండరన్నారు. సరికొత్త కాన్సెప్ట్, అద్భుతమైన గ్రాఫిక్స్, సాంకేతిక పరిజ్ఞానం హైలైట్‌గా ఉంటాయన్నారు. ఈ చిత్రం కోసం ఎలాంటి రాజీ పడలేదని చెప్పారు. పాంబాట్టం చిత్రానికి అమ్రిష్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారని, హాలీవుడ్‌ చిత్రాల తరహాలో రూపొందిన చిత్రమని దర్శకుడు తెలిపారు.  

మరిన్ని వార్తలు