తెలుగు, హీందీలో ఒక్కప్పుడు ఆమె స్టార్‌ హీరోయిన్‌, అచ్చం దివ్య భారతిలా..

26 Oct, 2021 20:46 IST|Sakshi

దివ్య భారతిని మైమరిపించిన ఈ హీరోయిన్‌ ఎవరో గుర్తుపట్టారా?

Mamta Kulkarni Recent Photos: ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా?.. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళం, తమిళంతో పాటు బెంగాళీ చిత్రాల్లో ఆమె ఒకప్పటి అగ్ర హీరోయిన్‌. దాదాపు స్టార్‌ హీరోలందరి సరసన ఆమె నటించారు. అచ్చం దివ్వభారతిని తలపించే ఈ నటి ఎవరో ఇప్పటికైన గుర్తోచ్చిందా. ఇంకా ఆమె గురించి చెప్పాలంటే అప్పట్లో ఆమె ఇచ్చిన టాప్‌లెస్‌ ఫొటోషూట్‌తో వివాదంలో చిక్కుకున్నారు. దీంతో ఆమె భారీగానే జరిమాన చెల్లించాల్సి వచ్చింది. ఆ హీరోయిన్‌ ఎవరో కాదు.. 1990లో తన అందంతో కుర్రకారు మతి పొగొట్టిన హీరోయిన్‌ మమత కులకర్ణి.

అయితే ఇప్పుడు ఆమె ప్రస్తావన ఎందుకు వచ్చిందాని ఆలోచిస్తున్నారా? అగ్ర హీరోయిన్‌గా రాణిస్తూనే ఒక్కసారిగా ఆమె తెరపై కనుమరుగయ్యారు. 2016లో పలు వివాదాలు  ఆమెను చుట్టుముట్టాయి. అనంతరం ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయిన మమత ఆ తర్వాత ఎక్కడ ఉన్నారు, ఏమైపోయారని అప్పట్లో ఆమె ఫ్యాన్స్‌ ఆందోళన చెందారు. ఈ నేపథ్యంలో మమత  తన లెటెస్ట్‌ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. దీంతో మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు. 1990లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించిన ఆమె తెలుగులో నటించిన చిత్రాలు సూపర్‌ హిట్‌గా నిలిచాయి. హీరో ప్రశాంత్‌ ‘ప్రేమ శిఖరం’ మూవీతో ఆమె టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.

ఈ మూవీలో ముందుగా దివంగత నటి దివ్వ భారతి నటించాల్సి ఉంది. కానీ ఆమె మృతి చెందడంతో అచ్చం తనలా ఉన్న మమత కులకర్ణిని ఈ సినిమాలో తీసుకున్నారు. అప్పటికే ఆమె బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగారు. ఆ తర్వాత మమత.. మోహన్‌ బాబు సరసన ‘దొంగ పోలీస్‌’, ‘బ్రహ్మ’ వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అలాగే హిందీలో కూడా పలువురు స్టార్‌ హీరోల సరసన కూడా నటించారామె. సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సైఫ్ అలీఖాన్, అజయ్ దేవగణ్, షారుఖ్ ఖాన్ వంటి స్టార్‌ హీరోలతో ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు.

అలా తన కెరీర్‌ మంచి ఫాంలో ఉండగానే ఓ ఎన్‌ఆర్‌ఐని వివాహం చేసుకుని న్యూయార్క్‌లో సెటిల్‌ అయ్యారు. ఆ తర్వాత వైవాహిక బంధంలో కలతలు రావడంతో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఆనంతరం కొంతకాలానికి మమత కులకర్ణి అంతర్జాతీయ డ్రగ్స్‌ వ్యాపారి విక్కీ గోస్వామిని వివాహం చేసుకున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై స్పష్టత లేదు. కానీ 2016లో విక్కీ గోస్వామి అరెస్ట్‌ తర్వాత మమత యుఎస్‌ డ్రగ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA) స్కానర్ కిందకు వచ్చింది. ఆ తర్వాత మమతా కులకర్ణిని డీఈఏ వాంటెడ్‌గా ట్యాగ్ చేసింది.

 

A post shared by mamta kulkarni (@mamtakulkarni201972_official)

A post shared by mamta kulkarni (@mamtakulkarni201972_official)

మరిన్ని వార్తలు