టాలీవుడ్‌ రీ ఎంట్రీకి రెడీ అంటున్న మలయాళ ముద్దుగుమ్మ

1 Feb, 2023 21:55 IST|Sakshi

మీరా జాస్మిన్ ఒకప్పుడు టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌. రవితేజ జంటగా నటించిన చిత్రం భద్ర సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత గుడుంబా శంకర్, గోరింటాకు సినిమాల్లో తనదైన నటనతో మెప్పించింది మలయాళ ముద్దుగుమ్మ. అయితే ఆ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు. తాజాగా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది మీరా జాస్మిన్‌.

దాదాపు పదేళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న మీరా రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో ప్రకటించారు. తన పాత్ర డబ్బింగ్‌కు సంబంధించిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. అయితే సినిమాకు సంబంధించిన వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత వేచి చూడక తప్పదు. ‘అమ్మాయి బాగుంది చిత్రంతో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.

ఆ తర్వాత టాలీవుడ్ అగ్రహీరోల సరసన నటించింది. ఆమె చివరిగా నటించిన తెలుగు చిత్రం 2013లో విడుదలైన ‘మోక్ష. ఆ తర్వాత ఆమె మలయాళం పలు సినిమాల్లో నటించారు.
 

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు