అత్యంత ప్రమాదకరమైన స్త్రీ ఆ పని చేయదు.. మెహ్రీన్‌ ఆసక్తికర పోస్ట్‌

10 Jul, 2021 08:53 IST|Sakshi

మెహ్రీన్‌ కౌర్‌ ఫిర్జాదా ఈ మధ్య నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. కొన్నాళ్ల క్రితం హరియాణా మాజీ ముఖ్యమంత్రి భజన్‌ లాల్‌ బిష్ణోయ్‌ మనువడు భవ్య బిష్ణోయ్‌తో గ్రాండ్‌గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న మెహ్రీన్‌.. ఇటీవల బ్రేకప్‌ చేసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చింది. పెళ్లి రద్దు విషయం తన పర్సనల్‌ అని, ఇకపై దీని గురించి చర్చ జరగకుండా ఉంటే బాగుంటుందని కూడా చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ఈ అంశం మీద స్పందించిన భవ్య కూడా తాను ఈ విషయం మీద స్పందించాల్సిన అవసరమే లేదన్నట్లు చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉంటే మెహరీన్‌ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. అందరికంటే అత్యంత ప్రమాదకరమైన స్త్రీ తనను తాను రక్షించుకోవడానికి మీ కత్తి మీద ఆధారపడడానికి నిరాకరిస్తుంది. ఎందుకంటే ఆమెకే సొంతంగా ఓ కత్తి ఉంటుంది’అని మెహ్రీన్‌ చెప్పుకొచ్చింది. కొటేషన్‌ కాస్త గందరగోళంగా ఉన్నా... తాను అత్యంత ప్రమాదకరమైన స్త్రీని అని, రక్షణ కోసం ఇతరులపై ఆధారపడబోనని చెప్పుకోవడానికే ఈ  పోస్ట్‌ చేసినట్లు కనిపిస్తోంది.  

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మరిన్ని వార్తలు