దర్శక-నిర్మాతల కోరిక తీర్చకుంటే ఆఫర్లు రావు: నటి

8 Aug, 2021 19:59 IST|Sakshi

కాస్టింగ్‌ కౌచ్‌ పెద్దగా ఈ పేరు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ  మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎక్కడ చూసిన ఈ పేరు బాగా వినిపిస్తోంది. మీ టూ ఉద్యమంలో భాగంగా చాలామంది నటీనటులు, హీరోయిన్లు పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ వేధింపులు తప్పవని, అవకాశాలు రావాలంటే కంప్రమైజ్‌ అవ్వాల్సిందేనని బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు చెప్పుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్‌ నటి నర్గీస్‌ ఫక్రీ కూడా క్యాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పింది.

పరిశ్రమలో తను ఎదుర్కొన్న వేధింపులు, తనకు సినిమా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. కాగా నర్గీస్‌ రాక్‌స్టార్‌ మూవీతో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆమె బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఈ మూవీ విజయంతో ఎన్నో అవార్డులు ‍కూడా అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌ హిట్స్‌గా నిలిచాయి. కానీ ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేకపోయింది. అయితే దానికి కారణం తాను కమిట్‌మెంట్‌ ఇవ్వకపోవగడమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘తొలి సినిమా భారీ విజయం సాధిస్తే ఎక్కడైన హీరోహీరోయిన్లకు ఆఫ్లరు వస్తాయి. కానీ నా విషమంలో అలా జరగలేదు.

బాలీవుడ్‌లో రాణించాలంటే దర్శక-నిర్మాతల కోరికలను తీర్చాల్సిందే. వాళ్లు చెప్పినట్టు చేయాలి, వారికి నగ్నంగా కనిపించాలి. అలా చేయనందుకే నాకు అవకాశాలు తగ్గాయి. కొందరు బడా దర్శక-నిర్మాతలు నన్ను కమిట్‌మెంట్‌ అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో అది మనసులో పెట్టుకని నాకు ఆఫర్స్‌ రాకుండా చేశారు’ అంటూ ఆమె ఆరోపించింది. కాగా నర్గీస్‌ తన తొలి చిత్రంతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సూప‌ర్ స్టార్ ఆఫ్ టుమారో-ఫీమేల్ కేట‌గిరీలో స్టార్ డ‌స్ట్‌, జీ సినిమా అవార్డులు అందుకుంది. అలాగే ఈ సినిమాతో ఐఫా అవార్డు కూడా అందుకుంది.

మరిన్ని వార్తలు