అలాంటి వాటిపై నమ్మకం లేదు.. కానీ భయమేస్తుంటుంది: నయనతార

27 Dec, 2022 08:32 IST|Sakshi

నటి నయనతార ఏం మాట్లాడినా వార్తల్లో నిలుస్తోంది. కారణం ఆమె స్టార్‌ డమ్, తన వ్యక్తిగత అంశాలే. నయనతార నటన, ప్రేమ, పెళ్లి, పిల్లలు అన్ని సంచలనాలే. తాజాగా నయనతార ప్రధాన పాత్రలో నటించి, తన భర్త విఘ్నేశ్‌ శివన్‌తో కలిసి రౌడీ పిక్చర్స్‌ పతాకంపై నిర్మించిన చిత్రం కనెక్ట్‌. హార్రర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో రూపొందిన చిత్రం ఇది. ఈ నెల 22వ తేదీ విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లను రాబడుతోంది. తాను నటించే ఏ చిత్ర ప్రచారానికి రాని నయనతార కనెక్ట్‌ చిత్ర ప్రచారంలో పాల్గొనడం విశేషం.

అలా ఒక కార్యక్రమంలో దెయ్యాలు ఉన్నాయని నమ్ముతారా? అన్న ప్రశ్నకు అలాంటి వాటిపై తనకు నమ్మకం లేకపోయినా ఒంటరిగా ఉన్నప్పుడు భయంగా ఉంటుందని చెప్పారు. నిజం చెప్పాలంటే దెయ్యాల కథా చిత్రాలకు తాను పెద్ద అభిమానినని తెలిపారు. ఇంతకుముందు దెయ్యాల ఇతివృత్తంతో కూడిన చిత్రాలను ఇష్టంగా చూసేదాన్ని అన్నారు. ఇకపోతే నయనతార, విఘ్నేష్‌ శివన్‌లు ఇటీవల కవల పిల్లలకు సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయిన విషయం తెలిసింది.

కాగా క్రిస్మస్‌ పండుగ సందర్భంగా ఈ దంపతులు తమ కవల పిల్లలతో ఇంట్లోనే క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆ వీడియోను తమ ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్‌ చేశారు. నయనతార విఘ్నేష్‌ శివన్‌ చెరొక బిడ్డను ఎత్తుకొని ఆనందంలో పరవశిస్తున్న ఆ దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి.  
చదవండి: చిరు, బాలయ్యలో ఉన్న కామన్‌ క్వాలిటీ అదే: శేఖర్‌ మాస్టర్‌

మరిన్ని వార్తలు