Trolls On Nia Sharma: బాడీ చూపించడం అంత ఇష్టమా?: నటిపై విమర్శలు

25 Dec, 2021 17:38 IST|Sakshi

Trolling On Nia Sharma: 'అదిరేటి డ్రెస్సు మేమేస్తే బెదిరేటి లుక్కు మీరిస్తే దడ.. ఆ మీకు దడ..' కొన్నేళ్ల క్రితం వచ్చిన పాట ఇప్పుడెందుకంటారా? అక్కడికే వస్తున్నాం.. సినీతారలు ఏం చేసినా సెన్సేషనే అవుతున్న ఈ రోజుల్లో వారి డ్రెస్సింగ్‌ స్టైల్‌ కూడా బాగా హైలైట్‌ అవుతోంది. అందాల ఆరబోతకు ప్రాధాన్యం ఇస్తున్న భామలు పొట్టి బట్టలతోనే కాక బ్యాక్‌లెస్‌, డీప్‌నెక్‌, సైడ్‌ కట్‌, ఇలా రకరకాల డ్రెస్సుల్లో దర్శనమిస్తున్నారు. అయితే కొందరు వారి అందాన్ని చూసి ఆస్వాదిస్తుంటే మరికొందరు మాత్రం ఛీఛీ.. బాడీ కనిపించేలా బట్టలేసుకోవడమే ఫ్యాషన్‌ అయిపోయిందని విమర్శించడం సర్వసాధారణమైపోయింది

తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ నియాశర్మ ట్రోలింగ్‌ బారిన పడింది. వీపు మొత్తం కనిపిస్తూ, మోకాలి పైభాగం వరకు కనిపించేలా కట్స్‌ ఉన్న డ్రెస్‌ వేసుకోవడంతో నెటిజన్లు ఆమెను దుమ్మెత్తిపోస్తున్నారు. 'మరీ ఇంత షో చేయడం అవసరమా?', 'తనకు బాడీని చూపించుకోవడం ఇష్టమేమో', 'ఏంటా దరిద్రపు డ్రెస్సు, సిగ్గుండక్కర్లా?' అని ఘాటు కామెంట్లు చేస్తున్నారు. నియా శర్మ ఇలా ట్రోలింగ్‌ బారినపడటం ఆమెకు కొత్తేమీ కాదు. అంతకు ముందు బికినీలో, కురచ దుస్తుల్లో కనిపించినప్పుడు సైతం నియాను సోషల్‌ మీడియాలో ఏకిపారేశారు.

A post shared by Nia Sharma (@niasharma90)

A post shared by Nia Sharma (@niasharma90)

మరిన్ని వార్తలు