నా సూట్‌కేస్‌ నిండా అవే!

4 Jan, 2021 00:27 IST|Sakshi
నిధీ అగర్వాల్‌

‘‘కొత్త బట్టలు ఎవరికి ఇష్టం ఉండదు? నాకైతే మరీ.. షాపింగ్‌ అంటే చాలా ఇష్టం. కోవిడ్‌ వల్ల షాపింగ్‌ చాలా మిస్సయ్యాను. మళ్లీ చాలా షాపింగ్‌ చేసేయాలనుంది’’ అంటున్నారు ‘ఇస్మార్ట్‌ శంకర్‌’ బ్యూటీ నిధీ అగర్వాల్‌. గత ఏడాది మొత్తం ఇళ్లకే పరిమితమయ్యాం. ఈ ఏడాదిలో ఏం చేయబోతున్నారు అనే ప్రశ్నకు ఈ విధంగా సమాధానమిచ్చారామె. ‘‘గత ఏడాది షూటింగ్‌ చేయడం మిస్‌ అయ్యా. అందుకే ఈ ఇయర్‌ ఎక్కువ పని చేయాలనుంది. ఫ్రెండ్స్‌తో కలసి బయటకు వెళ్లాలి. అలానే నాకు షాపింగ్‌ చేయడం ఇష్టం.

ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసీ చేసీ బోర్‌ కొట్టేసింది. స్టోర్స్‌ అన్నీ ఓపెన్‌ అయితే రెక్కలు కట్టుకుని వాలిపోవాలనిపించింది. ఇప్పుడు హ్యాపీగా షాపింగ్‌ చేస్తున్నా. కొత్త బట్టలు కొనుక్కుంటే భలే సంతోషంగా అనిపిస్తుంది. స్టోర్‌కి వెళ్లినప్పుడు ఎవరైనా గుర్తుపట్టే చాన్స్‌ ఉంది. వాళ్ళందరూ నా సినిమాలు చూసి, నచ్చాయి అని చెబుతున్నప్పుడు బావుంటుంది. అలానే ఎక్కడికి వెళ్లినా ఖాళీ సూట్‌కేస్‌ తీసుకెళ్తాను. బట్టలు, జ్యూవెలరీ కొనుక్కుంటాను. సూట్‌కేస్‌ని వాటితో నింపేస్తాను’’ అన్నారు నిధీ.

మరిన్ని వార్తలు