Nikki Tamboli: కొత్త కారు కొన్న బిగ్‌బాస్‌ బ్యూటీ, ధరెంతో తెలుసా?

28 Jun, 2022 16:53 IST|Sakshi

బిగ్‌బాస్‌ బ్యూటీ, నటి నిక్కి తంభోలి కొత్త కారు కొనుగోలు చేసింది. మెర్సిడెస్‌ బెంజ్‌ లగ్జరీ కారు కొన్నట్లు తాజాగా ఆమె సోషల్‌ మీడియా వేదికగా వెల్లడిచింది. ఈ మేరకు ఆమె కారుకు సంబంధించిన ఫొటోలను షేర్‌ చేసింది. ఈ సందర్భంగా తన తండ్రితో కలిసి ఈ స్పెషల్‌ డేను సెలబ్రెట్‌ చేసుకున్న ఫొటోలను కూడాఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. వీటికి ‘ఎప్పుడు నా ఎదుగుదలలో తోడుగా ఉన్నారు. పడిపోకుండ సపోర్టు ఇచ్చారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఎప్పటికి నేను మీ లిటిల్‌ గర్ల్‌నే’ అంటూ తండ్రితో దిగిన కారు ఫొటోలను షేర్‌ చేసింది.

చదవండి: అది చెత్త సినిమా.. దానివల్ల ఏడాది పాటు ఆఫర్స్‌ రాలేదు: పూజా హెగ్డే

కాగా నిక్కీ కొనుగోలు చేసిన మెర్సిడెస్‌ బెంజ్‌ జీఎల్‌ఈ కారు ధర దాదాపు రూ. 85.80 లక్షల నుంచి ఒక కోటి 25 లక్షల రూపాయల మధ్యలో ఉండోచ్చని అంచనా. ఇక నిక్కీ కొత్త కారు కొన్న విషయం తెలిసి ఆమె సహా నటీనటులు, బిగ్‌బాస్‌ సహా కంటెస్టెంట్స్‌ ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా నిక్కీ తంబోలి ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ అనే తెలుగు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఆమె ‘తిప్పర మీసం’, తమిళంలో కాంచన 3 వంటి చిత్రాలతో నటించి గుర్తింపు పొందింది. ఈ నేపథ్యంలో నిక్కీ హిందీ బిగ్‌బాస్‌ 14వ సీజన్‌ షో కంటెస్టెంట్‌గా ఆఫర్‌ అందుకుంది. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ గేమ్‌ షో కంత్రోన్‌ కే ఖిలాడీ షోలో సైతం నిక్కీ సత్తా చాటుకుంది.

A post shared by Nikki Tamboli (@nikki_tamboli)

>
మరిన్ని వార్తలు