Nimrat Kaur: నటికి చేదు అనుభవం, అమెరికా ఎయిర్‌లైన్‌పై బాలీవుడ్‌ బ్యూటీ ఫైర్‌!

27 Aug, 2022 13:21 IST|Sakshi

విమాన ప్రయాణంలో ప్రముఖ బాలీవుడ్‌ నటి నిమ్రత్‌ కౌర్‌కు చేదు అనుభవం ఎదురైంది. దీంతో ఆమె అమెరికా ఎయిర్‌లైన్‌పై సోషల్‌ మీడియా వేదికగా ఫైర్‌ అయ్యింది. ఇంతకి ఏం జరిగిందంటే. నిమ్రత్‌ కౌర్‌ ఇటీవల అమెరికా ఎయిర్‌ లైన్‌ డెల్టాలో ఇండియాకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఎయిర్‌పోర్ట్‌లో ఆమె లగేజ్‌ బ్యాగ్‌ ఒకటి మిస్‌ కాగా మరోకటి డ్యామేజ్‌ అయ్యింది. ఇదే విషయాన్ని ఆమె ట్వీట్‌ చేస్తూ డ్యామేజ్‌ అయిన బ్యాగేజీ ఫొటోలను షేర్‌ చేసింది.

చదవండి: జూ.ఎన్టీఆర్‌ సినిమాకు నో చెప్పిన సమంత? కారణం ఇదేనట!

ఈ సందర్భంగా ‘డెల్టా ఎయిర్‌ లైన్‌ సిబ్బంది నా లగేజ్‌ని ఎక్కడో మిస్‌ చేసింది. మరోక బ్యాగ్‌ అందిన అది పూర్తి డ్యామేజ్‌ అయ్యింది. దీనివల్ల నేను 90 గంటలకు పైగా ఇబ్బంది పడ్డాను. మానసికంగా, శారీరకంగా ఒత్తిడికి గురయ్యా. ఈ విషయంలో డెల్టా సంస్థ బాధ్యాతారాహిత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పిటికైన డెల్టా సంస్థ దీనిపై స్పందించి మిస్‌ అయినా నా లగేజ్‌ ఎక్కుడుందో గుర్తించి నా దగ్గరకు చేర్చాలని కోరుతున్నా’ అంటూ నిమ్రత్‌ ఆవేదన వ్యక్తం చేసింది.

చదవండి: ఖర్చు లేకుండా నయన్‌ దంపతుల హనీమూన్‌ ట్రిప్‌? ఎలా అంటే..

ఆమె ట్వీట్‌పై డెల్టా ఎయిర్‌లైన్‌ స్పందిస్తూ తన ఫిర్యాదుపై తక్షణమే చర్యలు తీసుకుంటామని, అప్పటి వరకు మీరు మాకు సహకరించాలని ఆమెను విజ్ఞప్తి చేసింది. కాగా రాజస్థాన్‌కు చెందిన నిమ్రత్‌ కౌర్‌ మోడల్‌గా, నటిగా ఇటూ భారత్‌ అటూ అమెరికాలో గుర్తింపు పొందింది. 200లో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఆమె హిందీలో పలు మ్యూజిక్‌ వీడియోల ద్వారా పాపులర్‌ అయ్యింది. ఆ తర్వాత పలు సినిమాలు, షార్ట్‌ పిలింస్‌లో నటించిన ఆమె ఇటీవల అభిషేక్‌ బచ్చన్‌ దాస్వి సినిమాలో నటించింది. 

మరిన్ని వార్తలు