కార్ ఛేజ్ చేస్తుండగా ప్రమాదం.. ది కశ్మీర్ ఫైల్స్ నటికి తీవ్రగాయాలు

16 Jan, 2023 19:38 IST|Sakshi

ది కశ్మీర్ ఫైల్స్ నటి, జాతీయ అవార్డ్ గ్రహీత పల్లవి జోషికి తీవ్ర గాయాలయ్యాయి. కార్ ఛేజింగ్ షూట్ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.  ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలైనట్లు సమాచారం.

బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కిస్తున్న 'వ్యాక్సిన్ వార్' సినిమా షూటింగ్‌లో ఈ సంఘటన జరిగింది.  ప్రస్తుతం ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. 
 

మరిన్ని వార్తలు