అందరూ దీని గురించే అడుగుతున్నారు.. ప్రముఖ నటి ఆవేదన

28 Nov, 2022 15:52 IST|Sakshi

ప్రముఖ మలయాళ నటి, మోడల్ పార్వతి నాయర్‌, ఆమె పనిమనిషి మధ్య కొద్ది రోజులుగా వివాదం నడుస్తున్న తెలిసిందే. ఇప్పటికే అతనిపై నటి పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. ఆమె ఇంట్లో ఖరీదైన వస్తువులు పోయాయంటూ పోలీసులను ఆశ్రయించింది పార్వతి నాయర్.

ఆ తర్వాత సుభాష్‌ మీడియా ముందుకొచ్చి పార్వతిపై సంచలన ఆరోపణలు చేశాడు. ఆమె ఇంట్లోకి రాత్రిళ్లు ఎవరెవరో వస్తున్నారని ఆరోపించాడు. ఇది చూసిన కారణంగానే తనపై కక్ష కట్టిందని అన్నారు. ఈ నేపథ్యంలోనే సుభాష్‌ ఆరోపణలపై పార్వతి తాజాగా మీడియాతో వెల్లడించారు. 

(చదవండి: పనిమనిషి ఆరోపణల్ని తీవ్రంగా ఖండించిన నటి పార్వతీనాయర్‌)

పార్వతి నాయర్ మాట్లాడుతూ.. 'అక్టోబర్‌లో మా ఇంట్లో ఖరీదైన ఎలక్ట్రానిక్‌ వస్తువులు పోయాయి. నేను అప్పుడు షూటింగ్‌లో ఉన్నా. అప్పుడు ఇంట్లో ఉన్నది సుభాష్‌ ఉన్నాడని పోలీసులకు చెప్పా. ఆ తర్వాత నుంచి నన్ను బ్లాక్‌ మెయిల్‌ చేయటం మొదలుపెట్టాడు. మొదట్లో నేను భయపడ్డా. తర్వాత అతడి మాటలు పట్టించుకోలేదు. తప్పు చేయకపోతే అతను ఎందుకు భయపడుతున్నాడు.

ఆమె మాట్లాడుతూ.. 'నా పరువుకు నష్టం కలిగించేలా మాట్లాడినందుకు దావా కూడా వేశా. అతడు చెప్పిన ప్రతీ విషయం అబద్ధం. కేసును తప్పుదోవ పట్టించటానికి ఇలా చేశాడు. అతడు తప్పు చేశాడని నా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి. నేను చట్టప్రకారం ముందుకు వెళ్లాలని చూస్తున్నా. అతడు ఓ అనాథ అని నాకు మొదట్లో చెప్పాడు. ఇప్పుడు మాత్రం అతడి తరఫున వాళ్లు నాకు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారు. నాకు చాలా బాధగా ఉంది. నేను పని చేస్తున్న ప్రొడక్షన్ వాళ్లు నన్ను అడుగుతున్నారు. నాకు మానసికంగా ఇబ్బంది ఎదురవుతోంది' అని ఆవేదన వ్యక్తం చేసింది. 

మరిన్ని వార్తలు