గట్టిగా ఏడవాలని ఉంది : హీరోయిన్‌

19 May, 2021 14:27 IST|Sakshi

కోవిడ్‌ కారణంగా ఇష్టమైన వ్యక్తుల్ని కోల్పోయానని.. ఎంతో బాధగా ఉందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఆర్‌ఎక్స్‌ 100' భామ పాయల్‌ రాజ్‌పుత్‌. ప్రస్తుతం తాను మానసిక కుంగుబాటుకు లోనైనట్లు తెలిపింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ పోస్ట్‌ పెట్టింది. 

‘నా జీవితంలో ఇదే అతి క్లిష్టమైన దశ. ఎంతో బాధగాఉంది. మానసిక కుంగుబాటుకు లోనయ్యా. గట్టిగా ఏడవాలని అనిపిస్తోంది. నాలోని బాధను చెప్పడానికి మాటలు కరవయ్యాయి. నాకెంతో ఇష్టమైన వ్యక్తిని కోల్పోయాను. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. దయచేసి అందరూ తమ కుటుంబసభ్యుల్ని సంరక్షించుకోవాలని సూచిస్తున్నాను’ అని పాయల్‌ పోస్ట్‌ పెట్టారు. ​

కాగా, పాయల్‌ ప్రియుడు సౌరభ్‌ ఢింగ్రా తల్లి అనితా కరోనా కారణంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఆమె మరణవార్త తనని ఎంతగానో కలచి వేసిందని పాయల్‌ సోషల్‌ మీడియా ద్వారా తెలియజేసింది. 

A post shared by Payal Rajput (@rajputpaayal)

మరిన్ని వార్తలు