Pia Bajpai : 'ఇంట్లో వాళ్లకు చెప్పకుండా ట్రీట్‌మెంట్‌.. సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను'

13 Dec, 2022 15:11 IST|Sakshi

స్టార్‌ హీరోయిన్‌ సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆటో ఇమ్యూన్‌ సమస్య కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి. ఒక్కోసారి కదల్లోని పరిస్థితి కూడా ఏర్పడుతుంది. ఆటో ఇమ్యూన్‌తో పాటు వైరస్‌, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్‌ వస్తుంది. ప్రస్తుతం సమంత దీనికి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కూడా మయోసైటిస్‌ వ్యాధితో పోరాడినట్లు హీరోయిన్‌ పియా బాజ్‌పేయ్‌ తెలిపింది.

సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఎందుకంటే నేను కూడా గతంలో మయోసైటిస్‌ బారిన పడ్డాను. చికిత్స లేని వ్యాధి బారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను. నాకు మయోసైటిస్‌ వచ్చిందని విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నా. సమంతకు మయోసైటిస్‌ ఉందని తెలియగానే బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చింది.  కాగా పియా బాజ్‌పేయి జీవా హీరోగా నటించిన 'రంగం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. 
 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు