Guess The Actress: ఈ బ్యూటీ అమితాబ్, ధోనీతో యాక్ట్ చేసింది.. ఇప్పుడేమో!

3 Oct, 2023 21:08 IST|Sakshi

ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే హిట్ కంపల్సరీ. అలా లేకపోతే అటు గుర్తింపు ఉండదు. ఇటు కొత్త ఛాన్సులు కూడా రావు. హీరోయిన్ల విషయానికొస్తే గ్లామర్, యాక్టింగ్ పరంగా సూపర్‌గా ఉండి, అద్భుతమైన బ్లాక్‌బస్టర్ కొట్టినప్పటికీ దాన్ని సద్వినియోగం చేసుకోలేక కనుమరుగైపోతుంటారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలాంటి బాపతే. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న అమ్మాయి పేరు పియా బాజ్‌పాయ్. ఉత్తరప్రదేశ్‌లోని ఎతావాలో పుట్టిన ఈమె దిల్లీలో సెటిలైంది. సినిమాల్లోకి వెళ్తానంటే తల్లిదండ్రులు తిట్టారు. దీంతో ఓవైపు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూనే నటి కావడం కోసం ప్రయత్నాలు స్టార్ట్ చేసింది. అందులో భాగంగా మకాం ముంబయికి మార్చింది. తొలుత సీరియల్స్‌కి డబ్బింగ్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలుపెట్టింది. అది బోర్ కొట్టేయడంతో మోడలింగ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత అమితాబ్,  ధోనీ లాంటి వాళ్లతో యాడ్స్‌లో నటించింది.

(ఇదీ చదవండి: థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?)

అలా యాడ్స్ చేస్తున్న టైంలో సౌత్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దృష్టిలో పడింది. ఆయన తీసిన ఓ యాడ్‌తో పియా ఫేమ్ తెచ్చుకుంది. 2008లో 'పోయ్ సొల్ల పోరమ్' అనే తమిళ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ఏడాదే 'నిన్ను కలిశాక' అనే సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే నటిగా మారిన మూడేళ్లకు 'రంగం' మూవీతో అద్భుతమైన గుర్తింపు తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత పలు సినిమాలు చేసినా హిట్ కొట్టలేకపోయింది.

అలా 2008-18 మధ్య తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో సినిమాలు చేసిన పియాకు ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోయాయి. ఈ ఏడాది ఓటీటీలో రిలీజైన హిందీ చిత్రం 'లాస్ట్'లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేసింది. నటిగా ఫామ్‍‌లో లేనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోతూ ఉంటుంది. దిగువన ఉన్న ఫొటోలు చూస్తే మీరే అవునంటారు. ఇంకెందుకు లేటు వీటిపై మీరు ఓ లుక్కేయండి.

(ఇదీ చదవండి: సల్మాన్‌ఖాన్ బండారం బయటపెట్టిన మాజీ ప్రేయసి)

A post shared by Pia Bajpiee (@piabajpai)

A post shared by Pia Bajpiee (@piabajpai)

మరిన్ని వార్తలు