రహస్యంగా పెళ్లి; పాపకు జన్మనిచ్చిన నటి

2 Jan, 2021 15:39 IST|Sakshi

విశ్వరూపం ఫేమ్‌ పూజా కుమార్‌ తల్లిగా ప్రమోషన్‌ పొందారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న పూజా ఇటీవల పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమై విషయాన్ని పూజా భర్త విశాల్‌ జోషి సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించారు. అప్పుడే పాపకి నవ‍్య జోషిగా నామకరణం కూడా చేశారు. తనకు కూతురు పుట్టిందన్న విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేస్తూ.. ‘ఒకప్పుడు మేము ఇద్దరం. కానీ ఇప్పుడు ముగ్గురం. మా చిన్నారి పాప నవ్య జోషిని మీ అందరికి పరిచయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఫీల్‌ అవుతున్నాం. నేను కలలుగన్న గొప్ప భాగస్వామిగా నాజీవితంలోకి వచ్చినందుకు, లిటిల్‌ నవ్యను ఈ ప్రపంచంలోకి తీసుకొచ్చినందుకు నీకు(పూజా) ధన్యవాదాలు. నా ఈ పుట్టినరోజును బెస్ట్‌ పుట్టినరోజుగా మలిచావు. లవ్‌ యూ బోత్‌ సో మచ్’‌.. అంటూ సతీమణి, కూతురిపై ప్రేమను కురిపించారు. అలాగే వీరిద్దరూ కూతురుతో దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింటా వైరలవుతున్నాయి. చదవండి: కమల్‌తో డేటింగ్‌.. పూజా క్లారిటీ

ఇదిలా ఉండగా న‌టి పూజా కుమార్ ర‌హ‌స్యంగా పెళ్లి చేసుకున్నారు. వెడ్డింగ్‌ ప్లానింగ్‌ కంపెనీ ‘జాయ్‌’ సీఈఓ విశాల్ జోషి అనే వ్యక్తిని పూజా కుమార్ వివాహం చేసుకున్నారు. కాగా 2000లో కాదల్ రోజావే చిత్రంతో కోలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ భామ కమల్ హాసన్ సరసన యాక్షన్ థ్రిల్లర్ విశ్వరూపంలో(2013) నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించారు. ఆ తర్వాత కమల్‌తో మరోసారి విశ్వరూపం-2, ఉత్తమ విలన్ సినిమాలతో జతకట్టారు. ఇక పూజా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. రాజశేఖర్‌ నటించిన ‘గరుడ వేగ’లో నటించారు. అమెరికాలోని మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో జన్మించిన పూజా భ‌ర‌తనాట్యం, క‌థ‌క్, కూచిపూడిలో ఆమె శిక్ష‌ణ పొందారు. 1995లో మిస్ ఇండియా యూఎస్ఏ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఆమె తల్లిదండ్రులు అమెరికాలో స్థిరపడ్డ ఎన్నారైలు. మ్యాన్ ఆన్ ఎ లెడ్జ్, బ్రాల్ ఇన్ సెల్ బ్లాక్ 99, బాలీవుడ్ హీరో వంటి హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు