Poonam Bajwa: ఆ సీక్రెట్‌ చెప్పమన్న నెటిజన్‌.. నటి రిప్లైకి నోట మాట రాలేదు!

21 Dec, 2021 14:40 IST|Sakshi

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్‌గా రాణించాలంటే అందం, అభినయంతో పాటు కాస్త అదృష్టం కూడా ఉండాలి. లేదంటే ఎంట్రీ ఇచ్చిన వెంటనే లేదా కొన్ని రోజులకు కనుమరుగయ్యే అవకాశాలు ఉన్నాయి. అందులో చాలా మంది ముద్దుగుమ్మలే ఉన్నారు. ఈ జాబితాలో చెప్పుకోదగిన వాళ్ల వరుసలో ముందుంటుంది పూనమ్‌ బజ్వా. టాలీవుడ్‌లో ‘మొద‌టి సినిమా’తో తన మొదటి సినిమాను ప్రారంభించింది ఈ అమ్మడు.

ఆ త‌ర్వాత బాస్ ‌, ప‌రుగు వంటి చిత్రాల‌తో నటించి మెప్పించింది కూడా. అప్పట్లో అందానికి, అభినయానికి ఏ మాత్రం కొదవ లేకపోవడంతో ఇండస్ట్రీకి మరో హీరోయిన్‌ దొరికింది అనుకున్నారంతా. కానీ తరువాత ఏం జరిగిందే ఏమో తెలుగు తెరపై నెమ్మదిగా కనుమరుగైంది ఈ బ్యూటీ. దీంతో త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్నడ చిత్రాల్లో నటిస్తూ మకాం మార్చింది ఈ ముద్దు గుమ్మ. అడ‌పా ద‌డ‌పా ఈ భాషల్లో నటిస్తూ త‌న ఉనికిని చాటుకుంటూనే ఉంది.


అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం తన అందచందాలతో నెటిజన్లకు నిద్రలేకుండా చేస్తోంది పూనమ్‌.  సాధారణంగా ఫోటోలతో తన ఫాలోవర్లకు పిచ్చేక్కించే ఈ బ్యూటీ.. ఈ సారి ముచ్చటించాలని అనుకుంది. దీంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానుల ప్రశ్నలకు స‌మాధానాలు ఇస్తోంది.

ఈ క్రమంలోనే ఓ నెటిజన్ నుంచి ఓ చిలిపి ప్రశ్న పూనమ్‌కు ఎదురైంది. అతను.. "మీ సెక్సీ స్ట్రక్చర్ వెనుకు దాగున్న రహస్యం ఏంటి? అని ప్రశ్నించాడు. దానికి "పూన‌మ్" ఏమాత్రం తడబడకుండా, కూల్‌గా... నేను ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగ చేస్తాను అని బదులిస్తూ తాను యోగ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో అమ్మడు ఇచ్చిన రిప్లేకి స‌ద‌రు నెటిజ‌న్‌కు నోట మాట రాలేదు.

చదవండి: Bigg Boss 5 Telugu: ఆ వైరల్‌ వీడియోపై షణ్ముఖ్‌ క్లారీటీ

మరిన్ని వార్తలు