బ్యాక్‌ డోర్‌తో ఇబ్బందులు

30 Oct, 2020 00:47 IST|Sakshi
పూర్ణ

హీరోయిన్‌ పూర్ణ ప్రధాన పాత్ర పోషిస్తున్న చిత్రం ‘బ్యాక్‌ డోర్‌’. నంది అవార్డు గ్రహీత కర్రి బాలాజీ దర్శకత్వంలో బి. శ్రీనివాస్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం పూర్ణ, తేజలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ‘‘బ్యాక్‌డోర్‌’ ఎంట్రీ వల్ల ఎదురయ్యే విచిత్ర పరిణామాల నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది’’ అన్నారు  కర్రి బాలాజీ. ‘‘బాలాజీగారు కంప్లీట్‌ క్లారిటీతో షూటింగ్‌ చేస్తున్నారు’’ అన్నారు బి. శ్రీనివాస్‌ రెడ్డి. ‘‘నిర్మాతకు రివార్డులు, దర్శకుడికి అవార్డులు తెచ్చిపెట్టే చిత్రమిది’’ అన్నారు పూర్ణ. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: రేఖ, కో–ప్రొడ్యూసర్‌: ఊట శ్రీను.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు