Actress Poorna : పెళ్లైన మొదటి రోజే నటి పూర్ణకు మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన భర్త

11 Nov, 2022 15:07 IST|Sakshi

సీమటపాకాయ్‌ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన మలయాళ ముద్దుగుమ్మ పూర్ణ. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన అవును సినిమాతో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న పూర్ణ ఆ తర్వాత అఖండ, దృశ్యం-2 వంటి చిత్రాల్లో నటించింది. అయితే హీరోయిన్‌గా కంటే బుల్లితెరపైనే ఎక్కువగా పాపులర్‌ అయిన పూర్ణ ఇటీవలె దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తూనే,కెరీర్‌లోనూ దూసుకుపోతుంది.

ఇదిలా ఉండగా పూర్ణకు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌ అవుతోంది. పూర్ణకు ఆమె భర్త షానిద్‌ కపూర్‌ పెళ్లైన తొలిరాత్రే సర్‌ప్రైజ్‌ చేశాడట.  కాస్ట్లీ అండ్​ రేర్ డైమండ్ రింగును ఆమెకు బహుమతిగా ఇచ్చాడట. అంతేకాదు ఆ రింగ్ నార్మల్గా చూస్తే పూర్ణ పేరు ఉండేలా రివర్స్​లో చూస్తే షానిద్ పేరు కనిపించేలా ప్రత్యేకంగా డిజైన్ చేశారట.

ఇక ఈ గిఫ్ట్‌ చూసిన పూర్ణ ఆనందానికి అవధులు లేకుండా పోయాయట. ఇప్పటికే పూర్ణకు ఆమె భర్త దాదాపు 170 తులాల బంగారంతో పాటు  ఓ లగ్జరీ విల్లాను కూడా ఆమె పేరు మీద గిఫ్ట్‌గా ఇచ్చినట్లు తెలుస్తుంది. వీటన్నింటి ఖరీదు సుమారు రూ. 30కోట్ల వరకు ఉంటుందని సమాచారం. 

మరిన్ని వార్తలు