వ్యాపారవేత్తను పెళ్లాడిన నటి

10 Aug, 2020 13:25 IST|Sakshi

న్యూఢిల్లీ: టీవీ నటి, ‘దియా ఔర్‌ బాతీ హమ్‌’ ఫేం ప్రాచీ తెహ్లాన్‌ ఓ ఇంటివారయ్యారు. ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త రోహిత్‌ సరోహను వివాహమాడారు. శుక్రవారం దేశ రాజధానిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలను ప్రాచీ ఆదివారం తన సోషల్‌ మీడియా అకౌంట్‌లో షేర్‌ చేశారు. ‘‘మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ సరోహా. వివాహ తేదీ: 7.8.2020’’అంటూ తమ జీవితంలోని ముఖ్య ఘట్టానికి సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. పెళ్లి సందర్భంగా వధువు ప్రాచీ ఎరుపు రంగు లెహంగాలో మెరిసిపోగా.. క్రీం కలర్‌ షేర్వాణీలో వరుడు రోహిత్‌ ఆకట్టుకున్నాడు. (కుటుంబంలోకి స్వాగతం మిహికా: సమంత)

ఈ క్రమంలో కొత్త జంటకు సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లితో పాటు ప్రాచీ మెహందీ, హల్దీ ఫంక్షన్‌కు సంబంధించిన ఫొటోలు సైతం అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. కాగా ఢిల్లీకి చెందిన ప్రాచీ తెహ్లాన్‌ భారత క్రీడాకారిణిగా మంచి గుర్తింపు దక్కించుకున్నారు. నెట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌ అయిన ఆమె.. 2010 కామన్‌వెల్త్‌ క్రీడల్లో భారత నెట్‌బాల్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించారు. నటనపై ఉన్న మక్కువతో టీవీ రంగంలో అడుగుపెట్టారు. ‘దియా ఔర్‌ బాతీ హమ్’‌(తెలుగు డబ్బింగ్‌- ఈతరం ఇల్లాలు) సీరియల్‌తో నటిగా ప్రాచుర్యం పొందారు.(అర్థరాత్రి కత్రినా ఇంటికి విక్కీ.. ఏదో ఉంది!)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా