Actress Raasi: బాలయ్య పక్కన హీరోయిన్‌ చాన్స్‌ వదులకున్న రాశి, ఆ సీన్‌పై అభ్యంతరంతోనే..

15 Jan, 2022 08:54 IST|Sakshi

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ఫ్యాక్షన్‌ బ్యాక్‌డ్రాప్‌లో 90ల్లో తెరకెక్కిన హిట్‌ చిత్రాల్లో ‘సమరసింహారెడ్డి’ ఒకటి. బాలకృష్ణ-సిమ్రాన్‌ జంటగా రూపొందిన ఈ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బి. గోపాల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సమరసింహారెడ్డి 1999లో సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యం, బాలయ్య నటనా విశ్వరూపం, బి.గోపాల్ డైరెక్షన్ ప్రతిభతో ఈ సినిమా బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించింది.

చదవండి: బ్రేకప్‌ చెప్పుకున్న లవ్‌బర్డ్స్‌!, క్లారిటీ ఇచ్చిన హీరో

రూ.6 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఏకంగా రూ.16 కోట్లు వసూలు చేసిందంటే ఏ రేంజిలో ఆడిందో అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో కొన్ని థియేటర్లలో 200 రోజులకు పైగా ఆడింది. ఈ సినిమా విడుదల నిన్న జనవరి 14కు 23 ఏళ్లు. ఈ సందర్భంగా గతంలో ఈ హిట్‌ చిత్రంపై సీనియర్‌ నటి, ఒకప్పటి ఫ్యామిలీ హీరోయిన్‌ రాశి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 1999లో సంక్రాంతి సందర్బంగా విడుదలైన ఈ చిత్రంలో మొదట హీరోయిన్‌గా రాశిని సంప్రదించగా దీనికి ఆమె నో చెప్పిందట.

చదవండి: ఏపీ ప్రభుత్వానికి ఆ హక్కు ఉంది: తమ్మారెడ్డి భరద్వాజ

అయితే రాశి ఈ మూవీ వదులుకోవడానికి గల కారణాలను గతంలో ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చింది.  దీంతో ఈ సంక్రాంతి సందర్భంగా గతంలో ఈ సినిమాపై ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఇంతకి రాశి ఏం చెప్పిందో మరోసారి చూద్దాం. కాగా సమరసింహారెడ్డి మూవీలో హీరోయిన్లుగా సిమ్రాన్, సంఘవి, అంజలా జవేరి నటించారు. ఇందులో మెయిన్‌ హీరోయిన్‌గా సిమ్రాన్ నటించింది. అయితే సిమ్రాన్‌ స్థానంలో మొదట హీరోయిన్‌ రాశిని అనుకున్నారట. అంతేకాదు దర్శకుడు ఆమెను సంప్రదించి కథ కూడా వివరించాడట.

చదవండి: సల్మాన్‌ ఖాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌, క్లారిటీ ఇచ్చిన నటి సమంత..

అయితే ఆ సినిమాలో ఓ సీన్ నచ్చకపోవడంతో రాశి అంత పెద్ద చిత్రాన్ని వదులుకుంది. అందులో హీరోయిన్‌తో సీతాకోకచిలుక సీన్ ఉంటుంది. ఆ సీన్ పట్ల రాశి అభ్యంతరం వ్యక్తం చేయడంతో దర్శకుడు నటి సిమ్రాన్‌ను కలిసి స్క్రిప్ట్‌ చెప్పాడట. ఆమెకు కథ నచ్చడంతో వెంటనే ఒకే చెప్పిందట సిమ్రాన్‌. అలా రాశి స్టార్‌ హీరోయిన బాలయ్య సినిమానే వదులుకుంది. అప్పట్లో ఇది కాస్తా ఆసక్తికిర సంతరించుకుంది. బాలయ్య సినిమాను వదులుకోవడంతో ఓ వర్గం వారి నుంచి రాశి అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొందట. 

మరిన్ని వార్తలు