ఫ్యాబులె‌స్ 50 అంటున్న శివ‌గామి

16 Sep, 2020 08:32 IST|Sakshi

ప్రముఖ న‌టి ర‌మ్య‌కృష్ణ 50వ వ‌సంతంలోకి అడుగుపెట్టారు. కుటుంబ‌స‌భ్యుల మ‌ధ్య మంగ‌ళ‌వారం పుట్టిన‌రోజు వేడుకలు జ‌రుపుకున్నారు శివ‌గామి. ఫ్యామిలీ మెంబ‌ర్స్ మ‌ధ్య ఫ్యాబుల‌స్ 50 వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకోవ‌డం ఆనందంగా ఉందంటూ రమ్యకృష్ణ ట్వీట్ చేశారు. తెలుగు, హిందీ, త‌మిళం భాష‌ల్లో న‌టించిన ర‌మ్య‌కృష్ణ త‌న న‌ట‌నా చాతుర్యంతో ఇప్ప‌టికీ అల‌రిస్తూనే ఉన్నారు. రాజమౌళి ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన 'బాహుబ‌లి'లోని శివ‌గామి పాత్ర‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అభిమానుల‌ను సొంతం చేసుకున్నారు. ఇటీవ‌లే జ‌య‌ల‌లిత బ‌యోపిక్‌ క్వీన్ అనే వెబ్ ‌సిరీస్‌లోనూ న‌టించారు. బాలీవుడ్‌లోనూ 'ఖల్ నాయక్', 'క్రిమినల్', 'షాపాత్',  'బడే మియాన్ చోటే మియాన్' వంటి సూపర్‌ హిట్‌ చిత్రాల్లోనూ న‌టించారు. అయితే ఆ తర్వాత ఆఫ‌ర్లు వ‌చ్చినా పెద్ద‌గా క‌థ‌లు న‌చ్చ‌లేదని, అందుకే బాలీవుడ్‌లో సినిమాలు చేయ‌లేదు అని తెలిపారు. ప్ర‌స్తుతం త‌న దృష్టి అంతా ద‌క్షిణాది సినిమాల వైపే ఉంద‌ని చెప్పుకొచ్చారు. (మా పిల్లలు ప్రతిభావంతులు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు