నటి రమ్య వ్యాఖ్యలపై ఆగ్రహం

14 May, 2022 07:06 IST|Sakshi

యశవంతపుర(బెంగళూరు):  కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై  నటి రమ్య చేసిన  వ్యాఖ్యలు  కాంగ్రెస్‌లో దుమారం రేపు­తున్నాయి. రమ్యా ఆ­రోపణలు చేయడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేసిన రమ్యా... కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో తనకు తెలియదని, రాష్ట్ర యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు మొహమ్మద్‌ నలపాడ్‌ తెలిపారు.  

ఆమెకు తమ పార్టీలో ఏ బాధ్యతలను అప్పగించలేదన్నారు. సమస్యలుంటే మా­ట్లా­డాలి తప్ప ఆరోపణలు చేయటం తగదన్నారు. నలపాడ్‌  మాటలపై రమ్య స్పందించారు. బెయి­ల్‌­పై ఉన్న వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ రమ్య శుక్రవారం ట్వీట్‌ చేశారు.

చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్‌! 

మరిన్ని వార్తలు