యశవంతపుర(బెంగళూరు): కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌పై నటి రమ్య చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్నాయి. రమ్యా ఆరోపణలు చేయడంపై కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డీకే శివకుమార్‌పై ఆరోపణలు చేసిన రమ్యా... కాంగ్రెస్‌లో ఉన్నారో లేదో తనకు తెలియదని, రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ నలపాడ్ తెలిపారు.
ఆమెకు తమ పార్టీలో ఏ బాధ్యతలను అప్పగించలేదన్నారు. సమస్యలుంటే మాట్లాడాలి తప్ప ఆరోపణలు చేయటం తగదన్నారు. నలపాడ్ మాటలపై రమ్య స్పందించారు. బెయిల్‌పై ఉన్న వ్యక్తి నాపై ఆరోపణలు చేస్తున్నారంటూ రమ్య శుక్రవారం ట్వీట్ చేశారు.
చదవండి: పెళ్లైన వారానికి పుట్టింటికొచ్చి అదృశ్యం.. ఇక్కడే అసలు ట్విస్ట్!