ముంబైలో కొత్తింట్లోకి షిఫ్ట్‌ అయిన రష్మిక

24 Jun, 2021 16:42 IST|Sakshi

పరిశ్రమలోకి వచ్చిన తక్కవ కాలంలోనే దక్షిణాది స్టార్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది రష్మిక మందన్నా.  ‘ఛలో’తో సూపర్‌ హిట్‌ కొట్టి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత విజయ్‌ దేవరకొండ ‘గీతగోవిందం’లో నటించి స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ తర్వాత వరుసగా  స్టార్‌ హీరోలతో సినిమాలు చేస్తూ బ్యాక్‌ టు బ్యాక్‌ ఆఫర్లతో యమ బిజీగా ఉంది. తెలుగులో టాప్‌ హీరోయిన్‌గా కొనసాగుతూనే, బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. ఒకేసారి గుడ్‌ బై, మిస్టర్‌ మజ్ను సినిమాల్లో నటిస్తూనే, మరో సినిమాకు కూడా సైన్‌ చేసింది. చూస్తుంటే బాలీవుడ్‌లోనే రష్మిక జెడ్‌ స్పీడ్‌లా దూసుకుపోయేలా కనిపిస్తుంది. కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఇటీవలె రష్మిక ముంబైలో ఓ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసిందన్న సంగతి తెలిసిందే. 

రీసెంట్‌గా కొత్త ఇంట్లోకి రష్మిక షిఫ్ట్‌ అయ్యింది. ఈ విష‌యాన్ని ఇన్‌స్టా ద్వారా తెలియ‌జేస్తూ.. ఎట్టకేలకు కొత్త అపార్ట్‌మెంట్‌లోకి షిఫ్ట్‌ అయ్యాను. దీనికోసం చాలానే షాపింగ్‌ చేయాల్సి వచ్చింది. అయితే నేను కొనాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి. నా అసిస్టెంట్‌ సాయి నాకు ఇళ్లు షిఫ్ట్‌ అవ్వడంలో సహాయం చేశాడు. ఆరా(పప్పీ) నేను చాలా అలసటతో ఉన్నా దానిని అధిగమించాం అంటూ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చింది. ఈ విల్లా ధర చాలా కాస్ట్‌లీ అని సమాచారం. ఇక రష్మిక ప్రస్తుతం తెలుగులో క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకూమర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

చదవండి: రష్మిక కోసం గూగుల్‌లో సెర్చ్‌ చేస్తూ 900 కి.మీ ప్రయాణం
ఛాన్స్‌ వస్తే ఆ హీరోతో డేటింగ్‌కు వెళ్తా : రష్మిక

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు