Rashmika Mandanna: దాన్ని ఇంకా నమ్మలేకపోతున్నా!

30 Aug, 2021 00:04 IST|Sakshi

Mission Majnu: బాలీవుడ్‌లో తన తొలి మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఆనందంలో ఉన్నారు రష్మికా మందన్నా.  ‘మిషన్‌ మజ్ను’ చిత్రంతో హిందీ పరిశ్రమకు ఆమె హీరోయిన్‌గా పరిచయం అవుతున్న విషయం తెలిసిందే.  సిద్ధార్థ్‌ మల్హోత్రా హీరోగా శాంతను బాగ్చి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో తన వంతు షూటింగ్‌ను పూర్తి చేశారు రష్మిక.

‘‘మిషన్‌ మజ్ను’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాను. చిత్రీకరణ చాలా సరదగా గడిచింది. శాంతను బాగ్చిగారు ‘మిషన్‌ మజ్ను’ కథ చెప్పినప్పుడే ఇలాంటి మంచి చిత్రంలో భాగం కావాలనుకున్నాను. హిందీలో నేను నటిస్తున్న తొలి సినిమాలో నా షూటింగ్‌ అప్పుడే పూర్తయిందనే విషయాన్ని నేను ఇంకా నమ్మలేకపోతున్నాను’’ అని పేర్కొన్నారు రష్మిక. అమితాబ్‌ బచ్చన్‌తో ‘గుడ్‌ బై’ అనే మరో హిందీ సినిమాలోనూ రష్మిక నటిస్తున్నారు.

సిద్ధార్థ్, రష్మిక

మరిన్ని వార్తలు