Sai Pallavi On Gargi Movie: నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది

12 Jul, 2022 08:46 IST|Sakshi
‘గార్గి’ మూవీ ప్రమోషన్‌లో సాయి పల్లవి

ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. వైవిధ్యమైన కథలు, పాత్రల్లో నటిస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇటీవల విరాట పర్వం చిత్రంతో అలరించిన ఆమె తాజాగా ‘గార్గి’ అనే చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ మూవీ జూలై 15న థియేటర్లోకి రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా సాయి పల్లవి మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన మనుసుని బాగా కదిలించిన కథ ఇది అని పేర్కొంది.

‘‘తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ సాగే కథ  ‘గార్గి’. న్యాయ వ్యవస్థపై పోరాటం కనిపిస్తుంది. నిత్యం మనకు ఎదురయ్యే ఘటనలే సినిమాలో ఉంటాయి. నా మనసుని బాగా కదిలించిన కథ ఇది’’ అని చెప్పుకొచ్చింది. గౌతమ్‌ రామచంద్రన్‌ దర్శకత్వంలో సాయిపల్లవి లీడ్‌ రోల్‌లో నటించిన ఈ చిత్రం ఇది. సినిమా తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో విడుదలయ్యే ఈ సినిమాను తమిళంలో హీరో సూర్య, జ్యోతికలు సమర్పిస్తుండగా, తెలుగులో రానా సమర్పిస్తున్నాడు. 

చదవండి: వైరల్‌.. వరుసగా పెళ్లి ఫొటోలు వదిలిన విఘ్నేశ్, సందడిగా కోలీవుడ్‌ స్టార్స్‌

‘‘ఫిదా, లవ్‌స్టోరి, విరాటపర్వం’ సినిమాల్లో తండ్రీకూతుళ్ల కథలో నటించాను. ఆ చిత్రాల్లో తండ్రితో కలిసి ఉండే పాత్ర నాది. కానీ ‘గార్గి’ చిత్రంలో భావోద్వేగం వైవిధ్యంగా ఉంటుంది. యుముడితో పోరాటం చేసి, సావిత్రి తన భర్త ప్రాణాలు దక్కించు కొన్నట్టు.. ఈ సినిమాలో నాకు దూరమైన నా తండ్రి కోసం న్యాయపోరాటం చేస్తాను. ఈ పాత్ర కోసం ఏం చేయాలి? ఎంత చేయాలి? అనే విషయాన్ని  దృష్టిలో పెట్టుకొని చేశాను.  ‘గార్గి’ కథ ముందు హీరోయిన్‌ ఐశ్వర్య లక్ష్మి వద్దకు వెళ్లింది. కథ ఆమెకు బాగా నచ్చడంతో తన సోదరుడు, దర్శకుడు గౌతమ్‌తో కలిసి నిర్మించింది. ఆమె ఒక హీరోయిన్‌ అయి ఉండి నాకు ఈ సినిమా ఇవ్వడంతో సంతోషపడ్డాను. ఈ సినిమాలో నేను టీచర్‌ పాత్ర చేశాను. తెలుగు, హిందీ, మరాఠీ భాషల్లో నా తర్వాతి చిత్రాలకు చర్చలు జరుగుతున్నాయి’’ అని చెప్పింది.

చదవండి: ఈ దసరాకు బరిలో దిగే చిత్రాలివే.. తలపడనున్న చిరు-నాగ్‌

అది బాధగా అనిపించింది..
‘ది కశ్మీర్‌ ఫైల్స్‌’ చిత్రంలో చూపించిన హింస, గోరక్షక దళాలు చేస్తున్న దాడుల మధ్య తేడా ఏముంది? మానవత్వం గురించి ఆలోచించాలి’ అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సాయిపల్లవి  చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన వ్యాఖ్యలపై ఆమె స్పందిస్తూ.. ‘నా మాటల్ని తప్పుగా అర్థం చేసుకోవడం బాధగా ఉంది. అయితే ఇప్పటికీ ఆ మాటలకు కట్టుబడి ఉన్నాను. నా మాటల తాలూకు స్వభావాన్ని ఆ తర్వాత ఇంగ్లీష్‌లో పోస్ట్‌ చేయడంతో వివాదం సద్దుమణిగింది’’ అన్నారు సాయిపల్లవి.

మరిన్ని వార్తలు