Salmana Khan-Samantha Lockwood: సల్మాన్‌తో సీక్రెట్‌ డేటింగ్‌పై నటి సమంత క్లారిటీ

బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ప్రేయసిల జాబితా చాలా పెద్దది. అప్పటి నటి సోమి అలీ, ఐశ్వర్యరాయ్‌ నుంచి ఇప్పటి కత్రినా కైఫ్‌తో పాటు పలువురు హీరోయిన్స్‌ వరకు ఎంతో మంది సల్మాన్‌ ప్రేమలో మునిగితేలారు. అయితే భాయిజాన్‌ మాత్రమే ఎవరితో ప్రేమాయాణం సాగించిన అది కొంతకాలం వరకే. ఆ తర్వాత ఎవరి దారులు వారే అన్నంటూ విడిపోయారు. అందుకే అయిదు పదుల వయసులో కూడా సల్మాన్‌ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా పిలిపించుకుంటున్నాడు. తాజగా సల్మాన్‌ ప్రియురాళ్ల జాబితాలో అమెరికా భామ సమంత లాక్‌వుడ్‌ చేరింది.

చదవండి: డబ్బు కోసం ఇంతలా దిగజారతావా, నీ స్థాయి మరిచిపోయావా?: హీరోయిన్‌పై ట్రోల్స్‌

కొంతకాలంగా భాయిజాన్‌ ఆమెతో డేటింగ్‌లో ఉన్నట్లు బీ-టౌన్‌లో జోరుగా ప్రచారం జరుగుతోంది. గత లాక్‌డౌన్‌లో సల్మాన్‌-సమంత లాక్‌వుడ్‌లు ఫాంహౌజ్‌లోనే ఉన్నారు. అప్పటి నుంచే వీరిద్దరు సీక్రెట్‌ డేటింగ్‌లో ఉన్నారంటూ వార్తలు గుప్పుమన్నాయి. అంతేగాక సమంత లాక్‌వుడ్‌ కూడా సల్మాన్‌, అతడి ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు హజరవ్వడం, భాయిజాన్‌ కుటుంబంతో తనకు ఎక్కువ  అటాజ్‌మెంట్‌ కూడా ఉంది. దీంత సల్మాన్‌ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఓ దశలో ప్రచారం కూడా జరిగింది. అయితే ఇప్పడు అవన్ని సద్దుమణిగాయి. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో సల్మాన్‌తో తన రిలేషన్‌పై తొలిసారిగా నోరు విప్పింది అమెరికా భామ.

చదవండి: ఒంటరిగా ఉండటం నచ్చడం లేదు.. షాకింగ్‌ న్యూస్‌ చెప్పిన నటి

సల్మాన్‌తో తన రిలేషన్‌పై క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘‘ప్రజలు చాలా మాట్లాడుతుంటారు. లేని దాని గురించి చాలానే చెప్పగలరు. నేను సల్మాన్ ఖాన్‌ను కలుసుకున్నాను. ఆయన మంచి వ్యక్తి. చెప్పడానికి ఇంతకు మించి ఏమీ లేదు. ప్రజలకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో నాకు తెలియదు. నేను కలవడం అంటే.. హృతిక్ రోషన్‌ కూడా కలుసుకున్నాను. కానీ, నా గురించి, హృతిక్ గురించి ఎవరూ ఏమీ మాట్లాడలేదు. ఈ వార్తలు ఎక్కడ నుంచి వచ్చాయో తెలియడం లేదు’’ అని స్పష్టం చేసింది. గత నెలలో హృతిక్ రోషన్‌తో తీసుకున్న సెల్ఫీని సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకోవడం తెలిసిందే. కాగా ఆమె ‘షూట్ ది మూవీ’తో బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది.

చదవండి: మరో వివాదంలో హీరో సిద్ధార్థ్‌, మహిళా కమిషన్‌ ఎంట్రీ

Author: కె. రామచంద్రమూర్తి
మరిన్ని వార్తలు