కరోనా బారిన నటి సమీరా

19 Apr, 2021 09:00 IST|Sakshi

బాలీవుడ్‌ నటి సమీరా రెడ్డి కరోనా బారిన పడింది. ఈ విషయాన్ని ఆమె ఆదివారం సోషల్‌ మీడియా వేదికగా వెల్లడించింది. 'నాకు కరోనావైరస్‌ పాజిటివ్‌ అని తేలింది. ఇంట్లో క్వారంటైన్‌లో ఉన్నాను. ప్రస్తుతానికి నేను క్షేమంగానే ఉన్నాను. నా ముఖం మీద చిరునవ్వు తీసుకొచ్చే ఎందరో నా చుట్టూరా ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలోనే మనం పాజిటివ్‌గా ధృడంగా ఉండాలి' అని రాసుకొచ్చింది. తన పిల్లలు కూడా కోవిడ్‌ లక్షణాలతో అస్వస్థతకు లోనయ్యారని, ఆ సమయంలో తనకు చాలా భయమేసిందని చెప్పుకొచ్చింది. కొడుకుకు పరీక్షలు నిర్వహించగా అతడికి కూడా పాజిటివ్‌ వచ్చిందని తెలిపింది. సెకండ్‌ వేవ్‌ను నిర్లక్ష్యం చేయకుండా కరోనా‌ పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.

తన పిల్లలు హన్స్‌, నైరాతో కలిసి సందడి చేసే సమీరా ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన వీడియోలను అభిమానులతో పంచుకుంటూ వారిని ఎంటర్‌టైన్‌ చేస్తోంది. ఇప్పుడు సడన్‌గా ఆమె కోవిడ్‌ బారిన పడటంతో ఫ్యాన్స్‌ టెన్షన్‌ పడుతున్నారు. వీలైనంత త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా సమీరా రెడ్డి, వ్యాపారవేత్త అక్షయ్‌ వార్డేను 2014లో పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఆమె సినిమాల్లో కనిపించడమే మానేసింది. ఇక ఈమె చివరిసారిగా 2012లో రానా దగ్గుబాటి హీరోగా నటించిన 'కృష్ణం వందే జగద్గురుమ్‌' సినిమాలోని స్పెషల్‌ సాంగ్‌లో కనిపించింది.

A post shared by Sameera Reddy (@reddysameera)

A post shared by Sameera Reddy (@reddysameera)

చదవండి: పెళ్లికి ముందు అజయ్‌ దేవ్‌గణ్‌ ఓ ప్లే బాయ్‌!

వ్యాక్సిన్‌కు, వివేక్‌ మృతికి సంబంధం లేదు

గుడ్‌ న్యూస్‌ చెప్పిన యాంకర్‌ సమీరా.. ఆ ఫోటోతో అలా..

మరిన్ని వార్తలు