Meena Birthday Celebration: మీనా బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో రంభ, సంగీత, సంఘవి.. ఫొటోలు వైరల్‌

17 Sep, 2022 21:18 IST|Sakshi

హీరోయిన్ మీనా తాజాగా తన 46వ పుట్టిన రోజును సెలబ్రెటీ స్నేహితులు మధ్య జరుపుకున్నారు. శుక్రవారం(సెప్టెంబర్‌ 16న) మీనా బర్త్‌డే. ఈ సందర్భంగా ఆమె తన ఇండస్ట్రీ స్నేహితులు, అలనాటి స్టార్‌ హీరోయిన్లు సంగీత, సంఘవి, రంభలతో కలిసి పుట్టిన రోజును జరుపుకుంది.  ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. మీనాకు ఇండస్ట్రీలో చాలామంది సన్నిహితులు ఉన్నారు. సంగీత, రమ్యకృష్ణ, సంఘవి, శ్రీదేవి విజయ్‌ కుమార్‌, రంభ, స్నేహ ఇలా చాలామంది తనకు ఆప్తమిత్రులని మీనా పలు సందర్భాల్లో చెప్పిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల భర్తను కొల్పోయి విషాదంలో ఉన్న మీనాకు వారంతా అండగా నిలుస్తున్నారు.

చదవండి: కాస్టింగ్‌ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు..

సందర్భం వచ్చినప్పుడల్లా వారంత మీనాను కలిసి కాసేపు ఆమెతో గడుపుతున్నారు. ఈ క్రమంలో నిన్న తన పుట్టిన రోజు కావడంతో రంభ, సంగీత, సంఘవిలు కలిసి ఆమె బర్త్‌డేను సెలబ్రెట్‌ చేశారు. మీనాతో కేక్‌ కట్‌ చేయించి తనతో కాసేపు సరదగా గడిపారు. ఈ సందర్భంగా వారితో దిగిన ఫొటోలను మీనా తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇలాటి కఠిన సమయంలో మీనాకు అండగా నిలుస్తున్న ఈ తారలపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అలాగే ‘నిజమైన స్నేహం అంటే మీది’, ‘మీనా గారు ఇండస్ట్రీలో మంచి స్నేహితులను పొందారు’ అంటూ ఆమె పోస్ట్‌పై ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు. 

A post shared by Meena Sagar (@meenasagar16)

మరిన్ని వార్తలు