'బుజ్జిగాడు' షూటింగ్‌ టైంలో ప్రభాస్‌ అదొక్కటే తినేవారు'

5 Aug, 2021 18:43 IST|Sakshi

Sanjana Galrani About Prabhas: బుజ్జిగాడు' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి సంజన గల్రానీ. పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ నటించిన ఈ సినిమా క్లాస్‌తో పాటు మాస్‌ ఆడియెన్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సినిమా విజయవంతం అయినా సంజనకు అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కన్నడ పరిశ్రమకు పరిమితమైన ఈ బ్యూటీ ఇటీవలె డ్రగ్స్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలు జీవితాన్ని అనుభవించిన సంగతి తెలిసిందే.

శాండల్‌వుడ్‌ ఇండస్ట్రీని కుదిపేసిన ఈ కేసుతో సంజన పేరు ఒక్కసారిగా హాట్‌టాపిక్‌గా మారింది.ఇక ఈ మధ్యే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన సంజన.. ఇటీవలె నటిగానూ ఆఫర్లు సొంతం చేసుకుంటుంది. ఓ సినిమా ప్రమోషన్‌ నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన సంజన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు విషయాలు పంచుకుంది. 'అరెస్ట్‌ అయి జైళ్లో ఉన్నప్పుడు ప్రతీరోజు జీసెస్‌, అల్లా, శివయ్యలను ప్రార్థించేదాన్ని. అంతేకాకుండా ప్రతీరోజు యోగా చేసేదాన్ని. వీటివల్లే ఇంత త్వరగా కంబ్యాక్‌ చేయగలిగాను. ఆ నెగిటివిటి నుంచి బయటపడగలిగాను' అని తెలిపింది.

ఇక బుజ్జిగాడు సినిమా గురించి మాట్లాడుతూ..ప్రభాస్‌ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. 'ప్రభాస్‌ లాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.ఆయన చాలా డెడికేటెడ్‌ యాక్టర్‌. రాయల్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా ఎంతో కష్టపడేవాడు. బుజ్జిగాడు షూటింగ్‌ సమయంలో ప్రభాస్‌ చాలా సన్నగా కనిపిస్తారు. క్యారెక్టర్‌ కోసం ప్రతిరోజు ఆయన కేవలం పెసరెట్టు మాత్రమే తినేవారు. ఆయన ఎంత హార్డ్‌ వర్క్‌ చేస్తారన్నది ప్రభాస్‌ ఫిజిక్‌ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఇప్పుడు పాన్‌ ఇండియా స్టార్‌ అయిపోయిన ప్రభాస్‌తో పనిచేసినందుకు సంతోషంగా భావిస్తున్నా' అని సంజన తెలిపింది. 
 

మరిన్ని వార్తలు