నేను బతికే ఉన్నాను, పూర్తి ఆరోగ్యంగా ఉన్నా: శారద

8 Aug, 2021 18:24 IST|Sakshi

ప్రముఖ సీనియర్‌ నటి శారద(ఊర్వశి) కన్నుమూశారంటూ సోషల్‌ మీడియాలో ఆదివారం ఉదయం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. అది చూసి సినీ ప్రముఖులు, నటీనటుటు ఆమె అభిమానులంతా ఆందోళన చెందారు. అయితే దీనిపై స్పష్టత కోసం వారంత ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో తాను బతికేఉన్నానంటూ ఆడియో రూపంలో ఆమె ఓ ప్రకటన విడుదల చేసి తన మరణంపై వస్తున్న పుకార్లకు చెక్‌ పెట్టారు.

‘నేను బ్రతికే ఉన్నాను. పూర్తి ఆరోగ్యంతో చెన్నైలోని నా నివాసంలో ఆనందంగా ఉన్నాను. కాకపోతే కాస్తా నలతగా ఉంది అంతే. నా ఆరోగ్యంపై, నా మృతి సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మకండి. నా ఆరోగ్యం బాగానే ఉంది. ఒక వ్యక్తి చేసిన పొరపాటుకు అందరూ ఆందోళ చెందుతున్నారు. దయ చేసి ఇలాంటి తప్పుడు వార్తలను సృష్టించకండి. నిజానిజాలు తెలుసుకొకుండా ఇలాంటివి వ్యాప్తి చేయడం బాధాకరం’ అని ఆమె అసహనం వ్యక్తం చేశారు. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఎన్నో చిత్రాల్లో ఆమె కథానాయికగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ క్రమంలో ఆమె ఉత్తమ నటిగా మూడు స్లార్లు జాతీయ అవార్డును అందుకున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 76 సంవత్సరాలు. 

మరిన్ని వార్తలు