ఇష్టం లేకపోయినా చేశా.. నటిగా అన్నీ చెయ్యాల్సిందే : శ్రద్దా దాస్

7 Jun, 2021 11:44 IST|Sakshi

హీరోయిన్‌ శ్రద్దా దాస్ రీసెంట్‌గా ఏక్‌ మిని కథ సక్సెస్‌తో జోరు మీదుంది. ఇప్పటివరకు శ్రద్దా పలు హిట్‌ సినిమాల్లో నటించినా ఆమెకు అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్‌ డోస్‌ పెంచినా ఆమెకు అదృష్టం కలిసి రాకపోవడంతో సరైన గుర్తింపు రాలేదు. కానీ వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది ఈ బ్యూటీ. ఇక సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ షేర్‌ చేస్తూ గ్లామరస్‌ ఫోటోలతో నెట్టింట హల్‌చల్‌ చేస్తుంది ఈ భామ.

తాజాగా సిగరెట్‌ కాలుస్తున్న ఓ ఫోటోను షేర్‌ చేస్తూ..నాకు సిగరెట్‌ తాగడం నచ్చదు. కానీ నటిగా మారినప్పుడు అన్నీ చేయాల్సిందే నచ్చకపోయినా సరే అంటూ సినిమా సెట్‌లోని ఈ ఫోటోను షేర్‌ చేసింది. కాగా ఇది నిజం సిగరెట్‌ యేనా లేదా డమ్మీదా అని నెటిజన్లు ప్రశ్నించగా..లేదు లేదు. ఇది నిజం సిగరెటే అని సమాధానమిచ్చింది. ఇక పొగతాడం ఆరోగ్యానికి హానికారం అంటూ ఓ క్యాప్షన్‌ను కూడా జోడించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అర్ధం, నిరీక్షణ ,కన్నడలో కోటిగొబ్బ వంటి సినిమాలు చేస్తోంది. 

A post shared by Shraddha Das (@shraddhadas43)

చదవండి : గుర్తుపట్టరాని విధంగా మారిపోయిన హీరోయిన్ మీనాక్షి
గుండెపోటుతో నటి సురేఖ మృతి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు