తొలి సిరీస్‌తోనే పాన్‌ ఇండియా అభిమానులు

27 Sep, 2020 06:49 IST|Sakshi

శ్రేయ చౌదరి..  ఓటీటీ వీక్షకులు పలవరిస్తున్న పేరు. కారణం బందిష్‌ బాండిట్‌ వెబ్‌సిరీస్‌. 

  • అమెజాన్‌ ‘ప్రైమ్‌ వీడియో’లో ప్రసారం అవుతోంది. అందులో కథానాయిక పాప్‌ సింగర్‌ తమన్నా శర్మనే  శ్రేయ చౌదరి. 
  • తొలి సిరీస్‌తోనే పాన్‌ ఇండియా అభిమానులను సంపాదించుకుని ఇక్కడ  పరిచయానికి మేకప్‌ చేసుకుంది. 
  • పుట్టింది కోల్‌కతాలో. పెరిగింది ముంబైలో. తల్లిదండ్రులు.. కంచన్‌ చౌదరి, రోహిత్‌ చౌదరి. శ్రేయకు ఒక అన్న... కరణ్‌ చౌదరి. 
  •  ముంబై.. నర్సీ మోన్‌జీ కాలేజ్‌లో మాస్‌ కమ్యూనికేషన్‌లో డిగ్రీ చదివింది. కాలేజ్‌లో ఉన్నప్పుడు టీవీ కమర్షియల్స్‌లో నటించడం మొదలుపెట్టింది. 
  •  2014లో ‘ఫెమినా మిస్‌ ఇండియా  కోల్‌కత్తా’ అందాల పోటీలో పాల్గొంది. ఎఫ్‌బీబీ మిస్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌’, ఫెమినా మిస్‌ బాడీ బ్యూటిఫుల్, టైమ్స్‌ మిస్‌ సుడోకు.. టైటిల్స్‌ను గెలుచుకుంది. 
  • డియర్‌ మాయా..  శ్రేయ తొలి సినిమా. 2017లో వచ్చింది. మనీషా కోయిరాలా, పాకిస్తానీ నటి మదీనా ఇమామ్‌తో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకుంది. 
  • ది అదర్‌ వే..  శ్రేయ నటించిన షార్ట్‌ ఫిల్మ్‌. యూట్యూబ్‌లో రిలీజ్‌ అయిన కొన్ని గంటల్లోనే పాతిక లక్షల వ్యూస్‌ వచ్చాయి. ఇందులో ఆమెది తలపొగరు పెళ్లికూతురి పాత్ర. దర్శకుడు ఇమ్‌తియాజ్‌ అలీ. 
  • బందిష్‌ బాండిట్‌తో ఓటీటీ ప్రవేశం చేసింది శ్రేయ.  సంగీతం, ప్రేమ జుగల్‌ బందీగా సాగిన ఆ సిరీస్‌ అశేష వీక్షకాదరణ పొందుతోంది.  ఇప్పుడు ఓటీటీ అభిమానుల చాటింగ్‌ టాపిక్స్‌ రెండే రెండు.. బందిష్‌ బాండిట్‌ అండ్‌ శ్రేయ చౌదురి. 
  • సంగీతం వినడం, గుర్రపు స్వారీ, ప్రయాణాలతోపాటు తన రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మీద లాంగ్‌ డ్రైవ్‌లు.. ఏ కొంచెం సమయం దొరికినా శ్రేయ ఆస్వాదించే అభిరుచులు. ఆమె బాక్సర్‌ కూడా.
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు