సిమ్రాన్‌ సెకండ్‌ ఇన్నింగ్స్‌.. తొలిసారిగా అలాంటి పాత్రలో..

27 Jun, 2021 17:06 IST|Sakshi

హీరోయిన్లు రూటు మార్చారు. ఒకప్పుడు గ్లామర్‌కే ప్రాధాన్యమిచ్చే హీరోయిన్స్‌ ఈ మధ్యకాలంలో నటనకే తమ ఫస్ట్‌ ప్రియారిటీ అంటున్నారు. భారీ రెమ్యునరేషన్‌ ఆఫర్‌ చేసినా పాత్ర నచ్చితేనే చేస్తాం అని తెగేసి చెబుతున్నారు. డీ గ్లామరస్‌ లుక్‌లోనూ కనిపించి నటనకే పెద్ద పీట వేస్తాం అంటున్నారు. మరోవైపు మొన్నటి వరకు స్టార్‌ హీరోయిన్లుగా నటించిన భామలు కాస్య వయసు పెరిగాక అక్క, వదిన, తల్లి, ప్రతినాయిక పాత్రలు చేయడానికి కూడా వెనకడుగు వేయడం లేదు. తాజాగా ఈ జాబితాలోకి నటి సిమ్రాన్‌ కూడా వచ్చి చేరారు. ఒకప్పుడు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున వంటి స్టార్‌ హీరోలతో జత కట్టిన సిమ్రాన్ ఇటీవలె సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించింది.

ప్రస్తుతం నటనకు ఆస్కారమున్న వైవిధ్యమున్న పాత్రలనే ఎంచుకుంటుంది. తాజాగా కోలీవుడ్‌ స్టార్‌ హీరో కార్తి నటిస్తున్న “సర్దార్” అనే చిత్రంలో నెగిటివ్‌ రోల్‌ చేయనుందనే ప్రచారం జరగుతుంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనున్న ఈ చిత్రంలో రజిషా విజయన్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక సిమ్రాన్‌ పాత్ర ఈ సినిమాలో కీలకంగా మారుతుందని టాక్‌ వినిపిస్తోంది. పిఎస్ మిత్రాన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. 
చదవండి : హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న జూనియర్‌ ఎన్టీఆర్‌ బావమరిది
ఘనంగా శంకర్‌ కూతురి వివాహం, హాజరైన సీఎం

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు