రాజుగారు అలా వచ్చారు: ‘డర్టీ హరి’ హీరోయిన్‌

16 Dec, 2020 11:50 IST|Sakshi

చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చాను

ఆ తర్వాత సినిమాలు చేయకూడదనుకున్నా

హీరోయిన్‌ సిమ్రత్‌ కౌర్‌ 

‘పరిచయం’ సినిమా తర్వాత సినిమాలు చెయ్యకూడదనుకున్నాను. ఎందుకంటే ఆ సినిమా కోసం చాలా కష్టపడ్డాను. పైగా చదువు ఆపేసి సినిమాల్లోకి వచ్చాను. చదువా? సినిమాలా? అనే డైలమాలో ఉన్నప్పుడు ‘డర్టీ హరి’ స్క్రిప్ట్‌తో ఎంఎస్‌ రాజుగారు దేవదూతలా వచ్చారు. స్క్రిప్ట్‌ కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో చేసిన జాస్మిన్‌ పాత్ర నాకు బాగా నచ్చింది’ అన్నారు సిమ్రత్‌ కౌర్‌. శ్రవణ్‌ రెడ్డి, సిమ్రత్‌ కౌర్, రుహానీ శర్మ ముఖ్య పాత్రల్లో ఎం.ఎస్‌. రాజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘డర్టీ హరి’.

ఈ సినిమా ఫ్రైడే మూవీస్‌ ఏటీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ఈ నెల 18న విడుదల కానుంది. సిమ్రత్‌ కౌర్‌ మాట్లాడుతూ– ‘నా మొదటి సినిమా ‘ప్రేమతో మీ కార్తీక్‌’లో ఫ్యామిలీ అమ్మాయిగా కనిపించా. కానీ, ‘డర్టీ హరి’లో నాది కాన్ఫిడెంట్‌ అండ్‌ బోల్డ్‌ పాత్ర. క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చెయ్యాలన్నది నా కల. ఎందుకంటే మా అమ్మానాన్న ఒలింపిక్‌ ప్లేయర్స్‌. కరాటేలో నాకు గోల్డ్‌ మెడల్‌ ఉంది’ అన్నారు. చదవండి: రాముడు... రావణుడు కాదు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు