'యాడ్స్‌' ద్వారా స్నేహ దంపతుల సంపాదన తెలిస్తే షాకే!

27 Jul, 2021 10:44 IST|Sakshi

స్నేహ..తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. ప్రియమైన నీకు చిత్రంతో తెలుగునాట ఎంట్రీ ఇచ్చిన స్నేహ తొలి చిత్రంతోనే బంపర్‌ హిట్‌ అందుకుంది. దీంతో తెలుగులో వరుస అవకావాలు ఆమెను వరించాయి. ‘శ్రీ రామదాసు’, ‘సంక్రాంతి’,‘రాధా గోపాలం’ వంటి వరుస విజయాలతో స్నేహ టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా గుర్తింపు పొందింది. మొదట్నుంచి  గ్లామర్ షోలకు దూరంగా ఉంటూ తన అభినయం, చీరకట్టుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న స్నేహను చాలామంది సౌందర్యతో పోల్చేవారు.

ఇక అదే సమయంలో తమిళంలో ఆపర్లు వస్తుండటంతో కోలీవుడ్‌కు వెళ్లిన స్నేహ ఆ తర్వాత టాలీవుడ్‌కు గుడ్‌బై చెప్పింది. తమిళంలో ‘అచ్చాముందు అచ్చాముందు’ అనే సినిమా షూటింగు సమయంలో హీరో ప్రసన్నతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. అలా పెద్దల అంగీకారంతో 2012లో వీరు వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే ఇద్దరూ జంటగా పలు అడ్వర్టైజ్‌మెంట్‌లలో మెరిశారు.

ఇక స్నేహ-ప్రసన్న జోడీకి ప్రత్యేకంగా అభిమానులున్నారు. దీంతో పలు యాడ్‌ కంపెనీలు కూడా వీరిని తమ బ్రాండ్‌ అంబాసిడర్‌లుగా నియమించుకున్నాయి. అలా ఇద్దరూ జోడీగా ఇప్పటికే పలు యాడ్‌ షూట్‌లలో నటించారు. కేవలం యూడ్స్‌ రూపంలోనే వీరు రూ. 3.50కోట్లు సంపాదించినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీనికి తోడు యాడ్‌ షూటింగ్‌లోనూ ఎంతో డెడికేషన్‌గా పనిచేస్తారని స్నేహ కపుల్స్‌కు మంచి పేరుంది. దీంతో వీరితో యాడ్స్‌ తెరకెక్కించేందుకు కంపెనీలు కూడా ఆసక్తిని చూపిస్తాయని సమాచారం. మొత్తానికి స్నేహ-ప్రసన్న దంపతులు అటు సినిమాలతో పాటు యాడ్‌ షూటింగ్స్‌లతో రెండు చేతులా సంపాదిస్తున్నారు. 

మరిన్ని వార్తలు