స్కూల్‌ల్లోనే ప్రేమలో పడ్డాను! మరో వ్యక్తితో 5 ఏళ్లు రిలేషన్‌ షిప్‌లో: హీరోయిన్‌

2 Oct, 2021 21:29 IST|Sakshi

Sonakshi Sinha About Her Relationship In Schooling and College: బాలీవుడ్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా స్కూల్‌ టైంలోనే ప్రేమలో పడ్డానని, ఆ వ్యక్తితో రిలేషన్‌ షిప్‌లో ఉన్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు శత్రఘ్న సిన్హా ముద్దుల తనయ అయినా సోనాక్షి ‘దబాంగ్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. పలు సనిమాల్లో నటించిన ఆమె నటిగా నిరూపించుకుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఈ క్రమంలో మీరు ఎప్పుడైనా రిలేషన్‌ షిప్‌లో ఉన్నారా? అని హోస్ట్‌ అడిగిన ప్రశ్నకు ఆమె ఆసక్తికరంగా బదులు ఇచ్చింది. 

చదవండి: భయపడుతూనే నటుడి బనియన్‌ వేసుకున్నా: ఊర్మిళ

ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘స్కూల్లో ఉన్నప్పుడు ఒక అబ్బాయితో రిలేషన్ షిప్‌లో ఉన్నాను. అయితే అది కొద్ది రోజులకే ఎండ్‌ అయ్యింది. ఇక నేను 21, 22 వయసులో ఉన్నప్పుడు సీరియస్ రిలేషన్ షిప్‌ను కొనసాగించాను. ఆ వ్యక్తితో అయిదేళ్లకు పైగా రిలేషన్ షిప్‌లో ఉన్నాను. ప్రతి రిలేషన్ షిప్ నుంచి మనం ఏదో ఒకటి నేర్చుకోవాలి. వయసు పెరిగే కొద్దీ కొత్త అనుభవాలు ఎదురవుతాయి. మనల్ని ప్రేమించే వ్యక్తులను వెతుక్కోవాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

చదవండి: ‘జేమ్స్‌ బాండ్‌’ కోసం లండన్‌ థియేటర్‌ మొత్తం బుక్‌ చేసిన బాలీవుడ్‌ నిర్మాత

మరిన్ని వార్తలు