భారతీయ అమ్మాయిలు సోమరిపోతులు.. హీరోయిన్ కామెంట్స్ వైరల్

17 Mar, 2023 18:16 IST|Sakshi

బాలీవుడ్ సోనాలి కులకర్ణి పెద్దగా బీ టౌన్‌లో పరిచయం అక్కర్లేని పేరు. కన్నడ సినిమాలతో సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. తమిళ, మరాఠీ, గుజరాతీ, కన్నడ, హిందీతో పాటు హాలీవుడ్ సినిమాల్లోనూ నటిగా గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించిన ఆమె నేషనల్ అవార్డుని కూడా అందుకుంది. తాజాగా ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.  

దేశంలోని చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులు అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ విషయంలో ఆమెకు కొందరు మద్దతు తెలుపుతుండగా.. మరికొందరు ఆమె వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఆధునిక భారతీయ మహిళలపై సోనాలి కులకర్ణి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె భారతీయ మహిళల గురించి మాట్లాడింది. ఈ రోజుల్లో బాగా సంపాదన, స్థిరపడిన వారినే భర్తగా కావాలని కోరుకుంటున్నారని తెలిపింది. 

సోనాలి మాట్లాడుతూ..'ఇండియాలో చాలా మంది అమ్మాయిలు సోమరిపోతులే. వారికి బాగా సంపాదించి, సొంతిల్లు ఉండాలని కోరుకుంటారు. రెగ్యులర్ ఇంక్రిమెంటట్స్ వచ్చే భర్త కావాలి. ఈ మధ్యకాలంలో మహిళలు తమ సొంతకాళ్లపై నిలబడటం మర్చిపోతున్నారు. తమ కోసం సంపాదించగలిగేలా మీ ఇళ్లలోని అమ్మాయిలను పెంచమని ప్రతి ఒక్కరినీ కోరుతున్నా. ఇంట్లో కొత్త ఫ్రిజ్ కావాలి. అందులో సగం మీరు చెల్లించండి. మిగిలిన సగం నేను చెల్లిస్తానని ఒక్క అమ్మాయియైనా చెప్పగలరా?. పురుషులకు 18 ఏళ్లు రాగానే కుటుంబానికి ఆర్ధికంగా మద్దతుగా ఉండేందుకు విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. కానీ 25 సంవత్సరాలు వచ్చిన మహిళలు మాత్రం తమ బాయ్ ఫ్రెండ్‌ను కావాల్సినవి కొనివ్వాలని బలవంతం చేస్తున్నారు.' అని ఇంటర్వ్యూలో మాట్లాడారు.

(ఇది చదవండి: నా గుండె గుబులుగా ఉంది.. సింగర్ సునీత ఎమోషనల్)

అమ్మాయిలు పెళ్లి విషయానికి వచ్చేసరికి.. అబ్బాయికి సొంతిల్లు ఉందా? 50 వేల పైనే శాలరీ, కారు ఉందా? అనేదే చూస్తున్నారు. అసలు అమ్మాయిలకి ఏమి కావాలి మంచి అబ్బాయిల? మంచి ఆఫర్లా? అని ప్రశ్నించారు. అమ్మాయి, అబ్బాయి  కష్ట, సుఖాలను సమానంగా పంచుకోవాలి.. కానీ అమ్మాయిలు అది వదిలేసి మానవ హక్కులు అంటున్నారని కులకర్ణి విమర్శించింది. సోనాలి కామెంట్స్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆమెనుప్రశంసిస్తుండగా.. చాలా మంది మహిళలు విమర్శిస్తున్నారు. కాగా.. దిల్ చాహ్తా హై, ప్యార్ తూనే క్యా కియా వంటి సినిమాల్లో సోనాలి నటించింది.


 

మరిన్ని వార్తలు