Guess The Actress: ఈమె కోసం స్టార్ హీరోలు ఎగబడుతున్నారు! ప్రతి మూవీలోనూ

22 Sep, 2023 19:37 IST|Sakshi

తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లకు కొదవలేదు. ప్రతి ఏడాది పండగలు వచ్చినట్లు.. భాష, దేశంతో సంబంధం లేకుండా ఇక్కడొచ్చి మరి మూవీస్‌లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రేక్షకుల్ని అన్ని రకాలుగా ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఈ బ్యూటీ కూడా సేమ్ అలానే. అమెరికాలో పుట్టింది, పక్క రాష్ట్రంలో పెరిగింది. ఇప్పుడు టాలీవుడ్‪‌లో సెన్సేషన్ అయిపోయింది. మరి ఈమె ఎవరో గుర్తుపట్టారా? లేదా చెప్పేయమంటారా?

అవును మీలో కొందరు అనుకున్నది నిజమే. పైన ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీ శ్రీలీల. ఇది టీనేజీలో దిగిన ఫొటో. కాస్త పోలికలు తెలుస్తున్నప్పటికీ పాత ఫొటో కావడం వల్ల కొందరైతే గుర్తుపట్టలేకపోతున్నారు. కానీ నవ్వు చూసిన కొందరు మాత్రం.. ఈ బ్యూటీనే అని గుర్తుపట్టేస్తున్నారు. తెలుగులో ఈమె కెరీర్ ఫ్లాప్‌తో మొదలైంది కానీ ఇప్పుడు మాత్రం రాకెట్ స్పీడులో దూసుకెళ్తోంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో ప్రమాదం.. నొప్పి తట్టుకోలేక లేడీ కంటెస్టెంట్ కేకలు!)

అమెరికాలో ఓ తెలుగు కుటుంబంలో పుట్టిన శ్రీలీల.. అక్కడే కొన్నాళ్లు పెరిగింది. అయితే పేరెంట్స్ విడాకులు తీసుకోవడంతో తల్లితో పాటు బెంగళూరు వచ్చేసింది. చిన్నప్పుడే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టిన ఈ బ్యూటీ.. టీనేజీలోకి వచ్చేసరికి కన్నడలో హీరోయిన్ అయిపోయింది. తెలుగులో 'పెళ్లి సందD' చిత్రంతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది. రెండో మూవీ 'ధమాకా' బ్లాక్‌బస్టర్ కొట్టింది. ఇందులో ఈమె డ్యాన్స్‌కి అందరూ ఫిదా అయిపోయారు.

ప్రస్తుతం మహేశ్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలతో వర్క్ చేస్తున్న శ్రీలీల.. మరోవైపు యంగ్ హీరోలతోనూ కలిసి వర్క్ చేస్తోంది. దసరా నుంచి మొదలుపెడితే దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి.. ఇలా రాబోయే నాలుగైదు నెలల్లో తలో సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించనుంది. వీటిలో కొన్ని హిట్ అయినా సరే హీరోయిన్‌గా ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ)

A post shared by Sreeleela (@sreeleela14)


మరిన్ని వార్తలు