Actress Sreevani: నటికి అరుదైన వ్యాధి, వారం రోజుల నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదు

26 Jul, 2022 14:56 IST|Sakshi

నటి శ్రీవాణి.. బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితురాలు. సినిమాలు, సీరియల్స్‌ ద్వారా అలరించే ఆమె తన యూట్యూబ్‌ ఛానల్‌లోనూ వీడియోలు చేస్తూ అభిమానులకు వినోదాన్ని పంచుతోంది. తాజాగా ఆమె యూట్యూబ్‌లో రిలీజ్‌ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ట్రెండ్‌ అవుతోంది. ఇందులో శ్రీవాణి భర్త మాట్లాడుతూ.. గలగలా మాట్లాడే శ్రీవాణి వారం రోజుల నుంచి మాట్లాడలేకపోతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. కొంచెం గట్టిగా మాట్లాడినా.. ఆమె గొంతు ఎప్పటికీ పోతుందని తెలిపాడు.

'గత కొన్ని వీడియోల్లో శ్రీవాణి గొంతు సరిగా రాకపోతే జలుబు వల్లేమో అనుకున్నాం. కానీ వారం రోజుల నుంచి ఆమె గొంతు పూర్తిగా పోయింది. అసలేమీ మాట్లాడటానికి రావట్లేదు. డాక్టర్‌ దగ్గరకు వెళ్తే.. నెల రోజుల వరకు ఆమె అస్సలు మాట్లాడకూడదని చెప్పాడు. కొన్ని మందులిచ్చాడు. నెల తర్వాత ఆమె మళ్లీ నార్మల్‌ అవుతుందన్న నమ్మకం ఉంది' అని చెప్పుకొచ్చాడు శ్రీవాణి భర్త.

చదవండి: ఈ వారం అలరించనున్న సినిమాలు, సిరీస్‌లు ఇవే..

మరిన్ని వార్తలు