Seniort Actress Sudha: తారక్‌ పెద్ద స్టార్‌.. తను అలా చేయాల్సిన అవసరం లేదు, కానీ..!

31 Dec, 2022 15:43 IST|Sakshi

నటి సుధ.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దాదాపు 500లకు పైగా చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది ఆమె. బాలనటిగా అలరించిన ఆమె పద్నాలుగేళ్ల వయసులోనే హీరోయిన్‌గానూ అలరించింది. అప్పట్లో తమిళ్‌, తెలుగులో పలువురు స్టార్‌ హీరో సరసన నటించిన ఆమె ప్రస్తుతం అక్క, అత్త, అమ్మ, వదిన వంటి పాత్రల్లో మెప్పిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఫ్యామిలీ ఆడియన్స్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే అని చెప్పాలి. 

చదవండి: రష్మికకు రిషబ్‌ శెట్టి గట్టి కౌంటర్‌, ట్వీట్‌ వైరల్‌

ఇదిలా ఉంటే ఇటివల ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో సుధ మాట్లాడుతూ.. తాను నాలుగు తరాల హీరోలతో నటించానంటూ ఆనందం వ్యక్తం చేసింది. ఇలాంటి ఘనత తనకే దక్కిందంటూ సుధ మురిసిపోయింది. అలాగే ఇప్పుటి హీరోల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. తారక్‌తో ఆమె బాద్‌షా చిత్రంలో స్క్రీన్‌ షేర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా బాద్‌షా మూవీ షూటింగ్‌ సమయంటో చోటుచేసుకున్న ఓ సంఘటనను గుర్తు చేసుకుంటూ తారక్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

ఈ మేరకు సుధ జూనియర్‌ ఎన్టీఆర్‌ గురించి మాట్లాడుతూ.. ‘తారక్‌ చాలా గొప్ప నటుడు. నిజానికి తనని వారు అని అనాలి. కానీ నా కొడుకు లాంటి వాడు కాబట్టి వాడు అంటున్నాను. తనతో నేను బాద్‌షా మూవీలో కలిసి నటించాను. తారక్‌ సెట్‌కి వస్తే చాలు గోలగోలగా ఉండేది. సెట్‌లో చాలా అల్లరి చేసేవాడు. అలాగే హుందాగా కూడా వ్యవహరించేవాడు. అంత పెద్ద స్టార్‌ అయినప్పుటికి సెట్‌లో అందరితో కలివిడిగా ఉంటాడు. బాద్‌షా షూటింగ్‌ అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరుగుతుంది. నేనూ తారక్‌ స్టేజ్‌పై డాన్స్‌ చేసే సీన్‌ అది.

చదవండి: మహేశ్‌-రాజమౌళి మూవీ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ బయటపెట్టిన రచయిత

మొదటి టేక్‌ బాగా వచ్చింది. కానీ నేను మరో టేక్‌కు వెళ్దాం అన్నారు. ఎందుకు బాగానే వచ్చింది కదా అన్నాడు తారక్‌. కానీ, ఎందుకో నేను మళ్లి చెద్దాం అన్నాను. అప్పుడు ప్రాక్టీస్ చేస్తుండగా నా కాలు స్లిప్ అయ్యి బెణికింది. వెంటనే కాలు వాచిపోయింది. అది చూసి ఎన్టీఆర్ పరిగెత్తుకుంటూ వచ్చి నా కాలు పట్టుకుని స్ప్రే చేసి జాగ్రత్తగా కూర్చోబెట్టాడు. అంత గొప్ప స్టార్‌కి అదంతా చేయాల్సిన అవసరం లేదు. ఏ బాబు చూడండమ్మా అని చెప్పచ్చు. చాలా మంది చూసి చూడనట్లు వెళ్లిపోతారు. కానీ, తారక్ అలాంటి వ్యక్తి కాదు. ఆ భగవంతుడు తారక్‌ చల్లగా చూడాలి’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది. 

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు