నా జీవితంలో చెత్తరోజు..సురేఖ వాణి కూతురు ఎమోషనల్‌ పోస్ట్‌

6 May, 2021 14:12 IST|Sakshi

Actress Surekha Vani : క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది సురేఖా వాణి.  హీరోహీరోయిన్లకి అక్కగా, వదినగా, అత్తగా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య సిసిమాల్లో పెద్దగా కనిపించకపోయినా.. సోషల్‌ మీడియాలో మాత్రం సందడి చేస్తోంది. అయితే సోషల్‌ మీడియాలో చలాకీగా కనిపించే సురేఖ నిజ జీవితంలో ఎన్నో కష్టనష్టాలు ఉన్నాయి.

సురేఖ వాణి భర్త సురేశ్‌ తేజ అనారోగ్యంతో 2019లో మృతి చెందిన విషయం తెలిసిందే. వీరిద్దరికి ఒక కూతురు ఉంది. ఆమె పేరు సుప్రిత. ఆమె కూడా సోషల్‌ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే సుప్రిత.. తాజాగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ని తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. ఈ రోజు(మే 6) సుప్రిత తండ్రి సురేశ్‌ తేజ వర్ధంతి. నేటికి ఆయన మృతిచెంది రెండేళ్లు అవుతుంది. ఈ సందర్భంగా సుప్రిత తన తండ్రిని తలుచుకుంటూ ఓ ఎమోషనల్‌ మెసేజ్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది.  

‘కొన్ని సార్లు మనం వారి మాటలను వినలేం.. వారి నుంచి ఫోన్ కూడా రాదు.. కానీ దాన్నే మనం ప్రేమ అంటాం. నాన్న నిన్ను మిస్‌ అవుతున్నా. నా జీవితంలో ఇదొక దుర్దినం. నువ్వు ఇప్పటికీ మా చుట్టునే ఉన్నావని భావిస్తున్నాను. కానీ అప్పుడే నువ్వు మమల్ని వదిలి రెండేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఐ మిస్‌ యూ నాన్న. నిన్ను ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటా’ అంటూ తన ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ని పెట్టింది సుప్రిత. ఆమె పోస్ట్‌ చూసిన నెటిజన్లు స్టే స్ట్రాంగ్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు