పవన్‌ కల్యాణ్‌ కలిస్తే 100 ముద్దులు ఇస్తా: సురేఖ వాణి

12 May, 2021 17:41 IST|Sakshi

క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించిన సురేఖ వాణి.. తల్లి, కోడలు, భార్య పాత్రలు పోషించి ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. అంతేకాదు ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఆమె ఈ మధ్య కాస్తా సినిమాలు తగ్గించించింది. అయినప్పటికీ ఈ మధ్య ఆమె తరచూ వార్తల్లో నిలుస్తోంది. తనకు సంబంధించిన ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాల్లో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలో ఓ షోకు అతిధిగా వచ్చిన సురేఖ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

తన భర్త చనిపోవడంతో అత్తింటివారి వేధింపులకు తట్టుకొలేక బయటక వచ్చానంటూ భావోద్యేగానికి లోనైంది. అయితే హీరోల్లో తను చిరంజీవికి పెద్ద అభిమానినని, ఆయన్ను చూసినప్పుడల్లా తన కళ్లల్లో నీళ్లు తిరుగుతాయని చెప్పింది. అలా ఒకరోజు ఏడుస్తుంటే చిరంజీవి ఓదార్చారని, ఆ తర్వాత ఒకరోజు వాళ్ల ఇంటికి భోజనానికి కూడా ఆహ్వానించారంటూ చెప్పుకొచ్చింది. ఇక తను బాలీవుడ్‌లో కూడా నటించానంటూ ఈ సందర్భంగా చెబుతూ.. హిందీలో మిథున్ చక్రబర్తి, జాకీష్రాఫ్ నటించిన సినిమాల్లో చెల్లెలి పాత్రలు చేశానని పేర్కొంది.

ఇక ఈ ఏడాది విజయ్‌ ‘మాస్టర్‌’ మూవీలో కూడా నటించానని, అయితే థియేటర్లలో తన సీన్‌ కట్‌చేసినట్లు ఆమె చెప్పింది. అయితే అమెజాన్‌ ప్రైమ్‌లో మాత్రం విజయ్‌తో చేసిన సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. చివరగా హోస్ట్‌ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం అందరిని ఆశ్చర్యపరిచింది. పరిశ్రమలోని హీరోల్లో ఎవరికైనా వంద ముద్దులు ఇవ్వాలనుకుంటే ఎవరికిస్తారని అడగ్గా.. ఏమాత్రం ఆలోచించకుండా పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ పేరు చెప్పడం కొసమెరుపు. సురేఖ వాణి కూతురు సుప్రీత సైతం సోషల్‌ మీడియాల్లో ఫుల్‌ యాక్టివ్‌ ఉంటుంది. తన పోస్టులకు నెటిజన్లు పెట్టె కామెంట్స్‌పై తనదైన శైలి ఆమె కౌంటర్లు ఇస్తుంటుంది. కాగా ప్రస్తుతం సుప్రీయ నటనలో శిక్షణ తీసుకుంటుందని, ఇక సినిమాల్లోకి రావడం రాకపోవడం తన ఇష్టమంటు సురేఖ పేర్కొన్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు