Tamanna: ఫ్యాన్స్‌తో తమన్నా మాస్‌ డాన్స్‌, వీడియో వైరల్‌

28 Oct, 2022 08:50 IST|Sakshi

మిల్కీ బ్యూటీ తమన్నా క్రేజ్‌ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. శ్రీ మూవీతో తెలుగు తెరపై మెరిసిన ఈ పంజాబీ భామ తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక డాన్స్‌లోనూ హీరోలకు పోటీ పడుతూ స్టెప్పులేస్తుంది. ప్రస్తుతం హీరోయిన్‌గా పలు చిత్రాలు చేస్తూ వీలు చిక్కినప​డల్లా స్పెషల్‌ సాంగ్స్‌తో అలరిస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఓ కార్యక్రమంలో తమన్నా ఫ్యాన్స్‌తో కలిసి డాన్స్‌ చేసిన వీడియో ప్రస్తుతం నెటింట వైరల్‌గా మారింది. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కి ముఖ్య అతిథికి హాజరైన తమన్నా అక్కడ అభిమానులతో మాస్‌ స్టెప్పులేసింది.

చదవండి: పెద్దింటి కోడలు కాబోతున్న యంగ్‌ హీరోయిన్‌ వర్ష!

ఇటీవల చెన్నైలో ‘మెటా క్రియేటర్స్ డే’ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా అటెండ్ అయిన తమన్నా.. తళపతి విజయ్ ‘మాస్టర్’ సినిమాలో ‘వాతీ కమింగ్’ సాంగ్ కి మాస్ స్టెప్పులేసి అదరగొట్టింది. ఆ వేడుకకు హాజరైన ఓ నెటిజన్.. తమన్నా డ్యాన్స్ వీడియోని ట్విట్టర్‌లో షేర్‌ చేయగా అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. కాగా ఇటీవల బబ్లీ బౌన్సర్‌, ప్లాన్‌ ఏ ప్లాన్‌ చిత్రాలతో ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులో ఆమె నటించిన గుర్తుందా సీతాకాలం మూవీ విడుదల కావాల్సి ఉంది.  

చదవండి: విజయ్‌తో స్వయంవరం? జాన్వీ కపూర్‌ షాకింగ్‌ రియాక్షన్‌

మరిన్ని వార్తలు