Tamannaah: సోషల్‌ మీడియాలో తమన్నా 'కొడ్తే' డ్యాన్స్‌ ఛాలెంజ్‌ వైరల్‌

29 Jan, 2022 15:35 IST|Sakshi

తమన్నా భాటియా.. టాలీవుడ్‌లో కొన్నేళ్లుగా తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వస్తోన్న ఈ మిల్కీ బ్యూటీ ఈ మధ్య అవకాశాలు అందుకోవడంలో కొంత వెనకబడినట్లు కనిపిస్తోంది. అందుకే కేవలం హీరోయిన్‌గానే కాకుండా విలన్‌ పాత్రలు పోషిస్తూ, అటు ఐటం సాంగ్‌లోనూ ఆడిపాడుతూ సత్తా చాటుతోంది తమన్నా. ఇటీవల ఆమె గని సినిమాలో కొడ్తే అనే స్పెషల్‌ సాంగ్‌లో చిందులేసింది. తాజాగా సోషల్‌ మీడియాలో మరోమారు ఈ పాటకు స్టెప్పేస్తూ ఇక మీ వంతు (ఇట్స్‌ యువర్‌ టర్న్‌) అంటూ అందరికీ ఛాలెంజ్‌ విసురుతోంది.

'ఎన్ని అవకాశాలైనా తీసుకోండి.. మళ్లీ మళ్లీ డ్యాన్స్‌ చేయండి. నేను కొడ్తే పాటకు చిందేస్తున్నాను. ఇక మీ వంతే మిగిలింది' అంటూ డ్యాన్స్‌ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. వరుణ్‌తేజ్‌, సాయి మంజ్రేకర్‌లతో పాటు పలువురికీ ఈ ఛాలెంజ్‌ విసిరింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. మరి కొడ్తే పాటకు ఎవరు స్టెప్పులేసి ఆకట్టుకుంటారో చూడాలి. కాగా ఈ సాంగ్‌ జనవరి 16న విడుదలైన విషయం తెలిసిందే.

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

మరిన్ని వార్తలు